Miyazaki mango | అయోధ్య బాలరాముడికి నైవేద్యంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.. ఒక్కో పండు ధర రూ.లక్ష..!
Miyazaki mango | అయోధ్యలోని రామ మందిరంలో కొలువైన బాలరాముడికి ప్రపంచంలోనే అరుదైన, అత్యంత ఖరీదైన జపనీస్ రకమైన "మియాజాకి" (Miyazaki) మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
Miyazaki mango | అయోధ్యలోని రామ మందిరంలో కొలువైన బాలరాముడికి ప్రపంచంలోనే అరుదైన, అత్యంత ఖరీదైన జపనీస్ రకమైన "మియాజాకి" (Miyazaki) మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అమోధ్యకు చెందిన ఓ భక్తుడు నైవేద్యంగా ఈ పండ్లను సమర్పించారు. స్థానిక సంప్రదాయాల ప్రకారం సోమవారం నాడు ఈ అరుదైన మామిడి పండ్లను తులసి దళంతో కలిపి స్వామివారికి ప్రసాదంగా అందించారు.
బాల రాముడికి మియాజాకి మామిడి..
జపాన్‌కు చెందిన 'మియాజాకి' (Miyazaki) రకం మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. 'ఎగ్ ఆఫ్ ది సన్' (Egg of the Sun) అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు చూడటానికి ముదురు ఊదా రంగులో ఉంటాయి. పండిన తర్వాత ఉదయించే సూర్యుడిలా మెరుస్తూ ఎరుపు రంగులోకి మారుతాయి. ఇవి సాధారణ మామిడి పండ్ల కంటే 15 శాతం ఎక్కువ స్వీట్‌గా ఉంటాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఉంటుంది. ఒకే ఒక్క పండు ధర సుమారు రూ.లక్ష వరకూ ఉంటుందని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటిగా నిలిచింది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రకం పండ్లను తొలిసారి బాలరాముడికి నైవేద్యంగా సమర్పించడం విశేషం.
ఈ మియాజాకి రకం మామిడి పండ్లను అయోధ్య ప్రాంతానికి చెందిన ఓం ప్రకాష్ సింగ్ అనే రైతు విజయవంతంగా తన తోటలో పండించారు. అయోధ్య వాతావరణ పరిస్థితులకు ఈ రకం సరిపోతుందో లేదో పరీక్షిచేందుకు అతను సుమారు రెండేళ్ల క్రితం మొక్కను నాటారు. ప్రస్తుత సీజన్‌లో తొలికాపు వచ్చింది. దాదాపు ఒక డజను పండ్లను కాసింది. దీంతో ఓంప్రకాష్ తొలి కాపును శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించారు. ఒక్కో పండు దాదాపు 250 గ్రాముల బరువు ఉంటుంది. ఈ సందర్భంగా ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. తన తోటలో కాసిన తొలి కాపును స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మియాజాకి మామిడి పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని తెలిపారు. ఇది సాధారణ మామిడిపండ్ల కంటే చాలా తియ్యగా ఉంటుందని చెప్పారు. ఇందులో అధిక పీచు పదార్థం (ఫైబర్), పోషక విలువలు పుష్కలంగా ఉంటాయన్నారు.
పోషకాల రారాజు..
"ఇది జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ రకం మామిడి పండు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఇది ఇతర రకాల కంటే చాలా తీపిగా ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటంతో పాటు విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయోధ్య వాతావరణంలో ఇది ఎదుగుతుందో లేదో పరీక్షించేందుకు నేను దాదాపు రెండేళ్ల క్రితం ఈ చెట్టును నాటాను. ఊహించిన దానికంటే చాలా బాగా పెరిగింది. ప్రస్తుత సీజన్‌లో తొలికాపు వచ్చింది. సుమారు ఒక డజను పండ్లను కాసింది. ప్రతి పండూ 150 గ్రాముల నుండి 300 గ్రాముల బరువు ఉంటుంది. సాంప్రదాయం ప్రకారం.. మొదటిగా పండిన మామిడి పండును స్వామివారికి నైవేద్యగా సమర్పించాను. మియాజాకితో పాటు నేను థాయ్‌లాండ్‌కు చెందిన 'బనానా మ్యాంగో', ఆస్ట్రేలియాకు చెందిన 'R2E2', భారతదేశానికి చెందిన 'చౌసా', 'దశేరి' వంటి రకాలను కూడా పండిస్తున్నాను" అని సదరు రైతు వివరించారు.
Also Read..
సింగిల్ డోర్ ఉన్న ఫ్రిజ్ బెటరా.. డబుల్ డోర్ ఉన్నది తీసుకోవాలా..?
నీట్ రీ-ఎగ్జామ్.. జూన్ 22 వరకూ టెలిగ్రామ్ యాప్ బ్లాక్
అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది : డొనాల్డ్ ట్రంప్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
జులై 27, 2026

Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే
జులై 13, 2026

Ram Mandir Construction | జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
జులై 11, 2026
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్



