Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు
Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు రామదాసి సురేష్ ఆత్మారామ్ మహారాజ్, ప్రధాన అర్చకులు రంగరాజన్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రాచీన భారతీయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాము, ధనుర్విద్యలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు, చిలుకూరు శివాలయం ప్రధాన అర్చకులు రామదాసి సురేష్ ఆత్మారామ్ మహారాజ్, ప్రధాన అర్చకులు రంగరాజన్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రాచీన భారతీయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాము, ధనుర్విద్యలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నమో వందే గోమాతరం మద్విరాజ్, స్వామి వివేకానంద విద్యాపరిషత్ ట్రస్ట్ చైర్మన్ తూడి కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న ప్రాచీన కళా నైపుణ్యాలను నేటి తరానికి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
వంద మంది పిల్లలకు ఈ కళల్లో శిక్షణ అందిస్తూ వారిలో ఆసక్తిని పెంపొందించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అవసరమని తెలిపారు. ఈ లక్ష్యంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మొక్కలు నాటడం ద్వారా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంతరించిపోతున్న చెట్లను సంరక్షించడం, ‘గుడి గుడికి జమ్మి చెట్టు’ వంటి కార్యక్రమాలు నిర్వహించడం సనాతన ధర్మంలో భాగమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మహా యజ్ఞంలా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర సమన్వయకర్త గర్రెపల్లి సతీశ్‌తో పాటు పలువురు పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..





