త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

Supreme Court | అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు, కానుకల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రెండు వారాల్లో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సోమవారం ఆదేశించింది.

P

National | Published On Jul 27, 2026, 5.26 pm IST

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
Advertisement

Supreme Court | అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలు, కానుకల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రెండు వారాల్లో దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని సోమవారం ఆదేశించింది. రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో దర్యాప్తును పర్యవేక్షించేందుకు జూలై 25న సిట్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ బృందంలో ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను కూడా చేర్చాలని సుప్రీంకోర్టు సూచించగా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐజీపీ కిరణ్‌ ఎస్‌ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటైందని తెలిపారు. ఇందులో డీఐజీ, సీనియర్‌ ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారని వివరించారు. విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ మాట్లాడుతూ.. భక్తులు రూ.500, రూ.1000 వంటి మొత్తాల్లో విరాళాలు ఇచ్చారని, అవి పూర్తిగా ట్రస్ట్‌కు చేరాయా లేదా అన్నదానిపై స్పష్టత అవసరమని అన్నారు. ట్రస్ట్‌కు అందిన విరాళాల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచితే పారదర్శకత పెరుగుతుందని సూచించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. "ఈ వ్యవహారాన్ని ముగించడం లేదు. పారదర్శకత కోసం తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం మా దృష్టి నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తుపైనే ఉంది" అని సీజేఐ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. గత విచారణలోనూ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగి తుది ఫలితానికి చేరుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లవద్దని, "కోర్టులు రాజకీయాలకు వేదికలు కావు" అని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దాఖలు చేసిన పురోగతి నివేదికలను సీల్డ్ కవర్‌లో పరిశీలించినట్లు కోర్టు తెలిపింది.

Advertisement
Advertisement