త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్ర‌స్టు.. అర్హ‌త‌లు ఇవే

Ayodhya Ram Temple | అయోధ్య రామాల‌యంలో (Ayodhya Ram Temple) భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాలు దుర్వినియోగం ఆరోప‌ణ‌ల వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆల‌య నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌ (Chief Executive Officer)ను నియ‌మించ‌నున్న‌ది. ఇందుకోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

D

National | Published On Jul 13, 2026, 4.32 pm IST

Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్ర‌స్టు.. అర్హ‌త‌లు ఇవే
Advertisement

Ayodhya Ram Temple | అయోధ్య‌లో కొత్తగా నిర్మించిన రామ‌మందిరం (Ayodhya Ram Temple) నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌ (Chief Executive Officer)ను నియ‌మించ‌నున్న‌ది. ఇందుకోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు సీఈవో పోస్టుకు ఉండాల్సిన అర్హ‌త‌ల గురించి సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టింది.

ట్ర‌స్ట్‌ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి ఉండాలి. అడ్మినిస్టేష‌న్ లేదా ఫైనాన్స్ రంగాల్లో క‌నీసం 20 ఏళ్ల అనుభ‌వం ఉండాలి. హిందూ మత విశ్వాసాలు కలిగి ఉండి. దేవాలయాలు లేదా పెద్ద సంస్థలను నిర్వహించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక అభ్యర్థి వయస్సు 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ వ‌చ్చి ఉండాలి. ఎంపికైన అభ్యర్థిని మొదట మూడేళ్ల కాలానికి నియమిస్తారు. వీరు ఈ పదవీ కాలంలో అయోధ్యలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. రామాల‌య రోజువారీ ప‌రిపాల‌న‌, ట్ర‌స్ట్ నిర్ణ‌యాల అమ‌లు, సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌, ఆల‌య స‌ముదాయం స‌జావుగా ప‌నిచేసేలా చూడ‌టం సీఈవో బాధ్య‌త‌.

ఆసక్తి గల అభ్యర్థులు జులై 18వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సెలెక్ష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ట్ర‌స్ట్ ఏర్పాటు చేసిన క‌మిటీ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి షార్ట్‌లిస్టు చేస్తుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ చేసి త‌న సిఫార్సుల‌ను అంద‌జేస్తుంది. జులై 22న జ‌రిగే ట్ర‌స్ట్ స‌మావేశంలో తుది అభ్య‌ర్థిని ఖ‌రారు చేస్తారు. జీతం, ఇత‌ర వివ‌రాల గురించి ఇంట‌ర్వ్యూలో చ‌ర్చిస్తారు. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువు అయిన జులై 18 త‌ర్వాత నెల‌రోజుల్లోగా ఈ ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని ఆల‌య క‌మిటీ భావిస్తోంది. ఆసక్తి, అర్హ‌త ఉన్న వాళ్లు గ‌డువులోపు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు.

Also Read..

పౌరసత్వ నిర్ధారణ న్యాయబద్ధంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

ఇరాన్ హిట్‌లిస్ట్‌.. జాబితాలో ట్రంప్‌, నెత‌న్యాహు, మెలోనీ, మాక్రాన్‌..

ఎస్ఎస్ఎస్ - శ్రీలీల డ్రీమ్‌బాయ్‌లో ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేన‌ట‌!

Advertisement
Advertisement