Donald Trump | అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెప్పారు. ఎప్పటికీ అణ్వాయుధాలను (nuclear weapon) తయారు చేయబోమని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
International | Published On Jun 16, 2026, 11.06 am IST
Donald Trump | అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. జూన్ 19న ఈ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలూ సంతకాలు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలను వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించినట్లు చెప్పారు. ఎప్పటికీ అణ్వాయుధాలను (nuclear weapon) తయారు చేయబోమని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్ల ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. "ఇరాన్‌తో డీల్ కుదిరింది. ఇందులో భాగంగా ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని టెహ్రాన్ అంగీకరించింది. అలాగే ఇరాన్‌కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అదంతా ఫేక్ న్యూస్" అని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు.
గత మూడు నెలలకుపైగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక కీలకమైన డ్రాఫ్ట్ ఫ్రేమ్‌వర్క్ (ముసాయిదా ఒప్పందం) కుదుర్చుకున్నాయి. దాడులను నిలిపివేయడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz)ను తిరిగి తెరవడం, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై మళ్లీ చర్చలు ప్రారంభించడం ఈ ఒప్పందంలో ప్రధానాంశాలు. ఈ తాత్కాలిక ప్లాన్ ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షల సడలింపుతో పాటు, దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలకు 60 రోజుల నెగోషియేటింగ్ విండోను కల్పిస్తోంది.
Also Read..
కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి
ఊబకాయం గురించి చాలా మందికి ఉండే పెద్ద అపోహలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






