Fridge | సింగిల్ డోర్ ఉన్న ఫ్రిజ్ బెటరా.. డబుల్ డోర్ ఉన్నది తీసుకోవాలా..?
Fridge | ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని నిర్ణయించుకున్నప్పుడు సింగిల్ డోర్ తీసుకోవాలా, డబుల్ డోర్ తీసుకోవాలా అనే సందేహం చాలా మందికి వస్తుంది. రెండూ ఆహారాన్ని తాజాగా ఉంచుతాయి, ప్రముఖ బ్రాండ్లలో అందుబాటులో ఉంటాయి, వివిధ బడ్జెట్‌లలో లభిస్తాయి. అయితే ఈ రెండు రకాల ఫ్రిజ్‌లు వేర్వేరు అవసరాలున్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి.
Technology | Published On Jun 16, 2026, 11.59 am IST
Fridge | ఇంటికి కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని నిర్ణయించుకున్నప్పుడు సింగిల్ డోర్ తీసుకోవాలా, డబుల్ డోర్ తీసుకోవాలా అనే సందేహం చాలా మందికి వస్తుంది. రెండూ ఆహారాన్ని తాజాగా ఉంచుతాయి, ప్రముఖ బ్రాండ్లలో అందుబాటులో ఉంటాయి, వివిధ బడ్జెట్‌లలో లభిస్తాయి. అయితే ఈ రెండు రకాల ఫ్రిజ్‌లు వేర్వేరు అవసరాలున్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు, ఒంటరిగా ఉండేవారు, జంటలు లేదా చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ మంచి ఎంపిక అవుతుంది. మరోవైపు పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ మోడల్ రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. మీ ప్రాధాన్యం తక్కువ ధర, తక్కువ విద్యుత్ ఖర్చు అయితే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ సరైన ఎంపిక. అయితే కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండి, ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ దీర్ఘకాలికంగా మెరుగైన పెట్టుబడిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు, చిన్న కుటుంబం అయినా, విద్యుత్ బిల్లు తక్కువగా రావాలన్నా, బడ్జెట్ తక్కువగా ఉన్నా సింగిల్ డోర్ ఫ్రిజ్‌లను తీసుకోవచ్చు.
తేడాలేమిటి..
కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే, ఒకేసారి ఎక్కువ గ్రోసరీ షాపింగ్ చేస్తే, పెద్ద ఫ్రీజర్ అవసరమైతే, మరింత సౌకర్యవంతమైన అనుభవం కోరుకుంటే డబుల్ డోర్ ఉన్న ఫ్రిజ్‌లను తీసుకోవాల్సి ఉంటుంది. సాధాణంగా 180 నుంచి 250 లీటర్ల మధ్య ఉన్న సింగిల్ డోర్ ఫ్రిజఠ్ ధర రూ.10వేల నుంచి రూ.22వేల వరకు ఉంటుంది. వీటిల్లో వచ్చే ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. అలాగే డబుల్ డోర్ ఫ్రిజ్‌లు సాధారణంగా 240 నుంచి 500 లీటర్ల కెపాసిటీతో వస్తాయి. వీటి ధర సుమారుగా రూ.22వేల నుంచి రూ.45వేలు లేదా ఆపైన ఉంటుంది. సింగిల్ డోర్ ఫ్రిజ్‌లలో ఫ్రీజర్ ప్రధాన కంపార్ట్‌మెంట్‌లోనే ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రత్యేకంగా టెంపరేచర్ సెట్ చేయడం కాస్త ఇబ్బంది అవుతుంది. అదే డబుల్ డోర్ అయితే ఫ్రిజ్ పై భాగంలో ఫ్రీజ్ ఉంటుంది. ఫ్రీజర్‌ను ప్రత్యేకంగా సెట్ చేసుకోవచ్చు. దీంతో నీళ్లు మంచు గడ్డలుగా మారి ఫ్రీజర్‌లో పేరుకుపోకుండా ఉంటాయి. సింగిల్ డోర్ ఫ్రిజ్‌ల కన్నా డబుల్ డోర్ ఫ్రిజ్‌లలోనే చాలా వరకు ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఇస్తారు. వేగంగా ఐస్ క్యూబ్‌లను తయారు చేసుకోవచ్చు. రెండు రకాల ఫ్రిజ్‌లు 4, 5 స్టార్ రేటింగ్‌లలో అందుబాటులో ఉన్నాయి. విద్యుత్ బిల్లు తక్కువ కావాలనుకుంటే రేటింగ్ ఎక్కువ ఉన్న ఫ్రిజ్‌ను ఎంచుకోవాలి. అయితే రేటింగ్ పెరిగిన కొద్దీ ధర కూడా కాస్త పెరుగుతుంది.
ఏది ఉత్తమం..
అధిక స్టోరేజ్ అవసరం లేకపోతే సింగిల్ డోర్ ఉన్న ఫ్రిజ్ సరిపోతుంది. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ధర కూడా తక్కువగానే ఉంటాయి. పెద్ద ఫ్రిజ్‌లతో పోలిస్తే విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అయితే కొందరు సింగిల్ డోర్ ఫ్రిజ్ కొన్నాక స్థలం సరిపోవడం లేదని లేదా ఫ్రీజర్ సమస్యలు వస్తున్నాయని చెబుతుంటారు. అలాంటి వారు డబుల్ డోర్ ఫ్రిజ్‌లను ఎంచుకోవడమే మంచిది. ఇక పెద్ద కుటుంబాలు ఉన్నా, ఇంట్లో ఎక్కువ స్థలం ఉన్నా, ధర ఫర్లేదు అనుకున్నా అలాంటి వారు పెద్ద ఫ్రిజ్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే పండ్లు, కూరగాయలు, ఇతర పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు స్థలం సరిపోక ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి నలుగురు వ్యక్తులు ఉంటే డబుల్ డోర్ బెటర్. ఇద్దరు వ్యక్తులకు సింగిల్ డోర్ ఫ్రిజ్ సరిపోతుంది.
సంబంధిత వార్తలు

Food Poisoning | ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా..? వైద్యులు ఏమంటున్నారు..?
ఏప్రిల్ 28, 2026

Bananas | అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని చెబుతున్న పరిశోధకులు.. ఎందుకంటే..?
ఏప్రిల్ 11, 2026

Electricity Bill | విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందా..? ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేయండి..!
ఫిబ్రవరి 11, 2026
తాజావార్తలు
- ●CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ●Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్
- ●Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
- ●Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్
- ●Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
- ●Sabarimala | శబరిమల అయ్యప్ప భక్తులకు హై అలర్ట్.. భారీ వర్షాలతో దేవస్వం బోర్డు కీలక సూచనలు..

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్



