NEET Re Examination | నీట్ రీ-ఎగ్జామ్.. జూన్ 22 వరకూ టెలిగ్రామ్ యాప్ బ్లాక్
NEET Re Examination | నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో (NEET Re Examination) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకూ టెలిగ్రాం యాప్‌ను (Telegram App) ఇండియా బ్లాక్ చేసింది.
NEET Re Examination | నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో (NEET Re Examination) కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకూ టెలిగ్రాం యాప్‌ను (Telegram App) ఇండియా బ్లాక్ చేసింది. జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్షా పత్రాల లీకేజీ ప్రయత్నాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతోపాటూ జూన్ 30వ తేదీ వరకు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం డిజేబుల్ చేసింది. పాత సందేశాలను ఎడిట్ చేసే ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని టెలిగ్రామ్ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి చీటింగ్ ముఠాలు నకిలీ పేపర్ లీక్ ఆధారాలను సృష్టించారని ఎన్టీయే పేర్కొంది. ఛానల్ అడ్మినిస్ట్రేటర్లు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ఒరిజినల్ టైమ్‌స్టాంప్ మారకుండా పాత ఫైళ్ల స్థానంలో కొత్త పీడీఎఫ్‌లను అప్‌లోడ్ చేస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫ్షన్‌ను దుర్వినియోగం చేసి చీటింగ్ ముఠాలు పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు నకిలీ ఆధారాలను సృష్టిస్తున్నారని ఎన్టీయే తెలిపింది. ఇక పేపర్ లీకేలకు చెందిన అనేక ఛానళ్లను, గ్రూపులను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది.
Also Read..
అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించింది : డొనాల్డ్ ట్రంప్
కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి
ఊబకాయం గురించి చాలా మందికి ఉండే పెద్ద అపోహలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Manushi Chhillar | నేనూ పేపర్ లీక్ బాధితురాలినే.. విద్యార్థుల బాధ నాకు తెలుసు : బాలీవుడ్ నటి
ఆగస్టు 1, 2026

Supreme Court | అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడొచ్చు : సుప్రీంకోర్టు
జులై 30, 2026

Rajya Sabha | నడ్డా Vs ఖర్గే.. సీజేపీ ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై భగ్గుమన్న రాజ్యసభ
జులై 29, 2026
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్



