Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. బోనాల విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి ఆత్మీయ స్వాగతం పలికారు.
Bonalu | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికార నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. బోనాల విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విందు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అతిథులను ఆప్యాయంగా పలకరించి, స్వయంగా ఆతిథ్యం అందించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లి మల్లమ్మ, సతీమణి మంజుల, కుమారులు పృథ్వీ, ప్రణవ్‌తో పాటు కుటుంబ సభ్యులు, బంధువులను పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాల వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకున్న ఆత్మీయ సమావేశంగా మారింది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..

Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్






