Ram Mandir Construction | జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ పనులు పూర్తి : నృపేంద్ర మిశ్రా
Ram Mandir Construction | అయోధ్య (Ayodhya)లోని రామ మందిరం ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ (Ram Mandir Construction) జులై 30 నాటికి పూర్తవుతాయని రామ్ మందిర్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) తెలిపారు.
Ram Mandir Construction | త్రినేత్ర.న్యూస్ : అయోధ్య (Ayodhya)లోని రామ మందిరం ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ (Ram Mandir Construction) జులై 30 నాటికి పూర్తవుతాయని రామ్ మందిర్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) తెలిపారు. ఆలయానికి అనుబంధంగా నిర్మిస్తున్న స్మారక నిర్మాణ పనులు దాదాపు పూర్తైనట్లు చెప్పారు. అక్కడ నిరంతరం వెలిగే అఖండ జ్యోతి ఏర్పాటుకు సంబంధించిన పని మాత్రమే మిగిలి ఉందన్నారు. మిగతా నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని వివరించారు.
శనివారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తవుతున్నప్పటికీ.. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న నాలుగు కిలోమీటర్ల రక్షణ గోడ, ఒక ఆధునిక మ్యూజియం వంటి ఇతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. వీటిని ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణాన్ని సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేస్తామని, అలాగే ఆలయ సముదాయానికి బయట నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు నవంబర్ లేదా డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.
భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక అనుభూతిని అందించేలా రూపొందిస్తున్న 20 గ్యాలరీలతో కూడిన ‘రామ్ కథా సంగ్రహాలయ్’ పనులపై కూడా మిశ్రా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న 20 గ్యాలరీలకు సంబంధించిన స్టోరీలైన్ ఖరారైందని.. గ్యాలరీల్లో వినియోగించనున్న సాంకేతికత, వీడియో ప్రదర్శనలపై నేడు, రేపు జరగబోయే సమావేశాల్లో తుది నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
అది చాలా అవమానకరం..
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన రామమందిర విరాళాల చోరీ కేసుపై కూడా మిశ్రా స్పందించారు. ఈ ఘటన తీవ్ర అవమానకరంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆలయ నిర్వహణకు సంబంధించిన సమస్య అని అన్నారు. వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read..
2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
మటన్ కోసం కుర్చీలు, కర్రలు విరిగాయ్.. పెండ్లి విందులో రచ్చరచ్చ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్
ఆగస్టు 18, 2026

Ram Mandir Donations Row | రామ్‌లల్లా ఊయల కోసం 150 కిలోల వెండి వస్తే.. 85 కిలోలతోనే దాన్ని తయారు చేశారు
ఆగస్టు 3, 2026

Ayodhya Ram Temple | సీఈవో పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న అయోధ్య ట్రస్టు.. అర్హతలు ఇవే
జులై 13, 2026
తాజావార్తలు
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!
- ●CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ
- ●MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ
- ●Oil Palm Hub | సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ ఆసక్తి
- ●Minister Jupally Krishna Rao | శ్రీలంక - తెలంగాణ మధ్య పర్యాటక బంధానికి మరింత ఊతం

Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు

Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

CP Sajjanar | సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్.. సెల్‌ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత లేఖ



