Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు – ఇప్పుడు మూడు కోట్లు – రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
ప్రస్తుతం దక్షిణాది ఇండస్ట్రీలో కయదు లోహర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం భాష ఏదైనా ఓ కొత్త సినిమా అనౌన్స్ అవుతుందంటే హీరోయిన్‌గా ఈ అమ్మడు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఎనిమిది సినిమాలు చేస్తోంది.
Naresh N
Entertainment | Published On Aug 2, 2026, 9.30 pm IST

సౌత్ ఇండస్ట్రీలో తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కయదు లోహర్ రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు పారితోషికం స్వీకరిస్తోంది ఈ అస్సాం బ్యూటీ.

కెరీర్ ఆరంభంలో శ్రీవిష్ణు అల్లూరితో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. వీటి కోసం కేవలం 30 లక్షల వరకు మత్రమే రెమ్యూనరేషన్‌ను కయదు లోహర్ స్వీకరించినట్లు సమాచారం. సక్సెస్‌లతో పారితోషికాన్ని మూడింతలు పెంచేసింది.

ప్రస్తుతం తెలుగులో నాని ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కయదు లోహర్. ఇందులో సుబ్బలక్ష్మి అనే పాత్రలో కనిపించబోతుంది.

తమిళంలో సూర్య కొత్త మూవీతో మరో మూడు సినిమాలు, మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది కయదు లోహర్.

సినిమాలతో పాటు వీడియో ఆల్బమ్స్‌లో కూడా నటిస్తోంది. సాయి అభ్యంకర్‌తో కలిసి కయదు లోహర్ నటించిన ఓ తమిళ వీడియో సాంగ్ పెద్ద హిట్టయ్యింది.
తాజావార్తలు
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ
- ●KTR | ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు.. బంగారం వైపు పెట్టుబడిదారుల పరుగులు..
- ●Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
- ●Hyderabad | పంజాగుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మాయం..
- ●Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

KTR | ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు.. బంగారం వైపు పెట్టుబడిదారుల పరుగులు..

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ


