Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
Solar Eclipse | ఈ నెలలో ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించనుంది. అయితే భారతీయులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురుకానుంది. గ్రహణం ఏర్పడే సమయానికి దేశంలో రాత్రి ఉండటంతో భారత్‌లోని ఏ ప్రాంతంలోనూ దీన్ని వీక్షించే అవకాశం ఉండదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
Solar Eclipse | ఈ నెలలో ఆకాశంలో అరుదైన ఖగోళ ఘట్టం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుండగా, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించనుంది. అయితే భారతీయులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురుకానుంది. గ్రహణం ఏర్పడే సమయానికి దేశంలో రాత్రి ఉండటంతో భారత్‌లోని ఏ ప్రాంతంలోనూ దీన్ని వీక్షించే అవకాశం ఉండదని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సంపూర్ణ సూర్యగ్రహణం అంటే భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు సరిగ్గా అడ్డుగా రావడం. ఈ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయడంతో కొద్దిసేపు పగటిపూటే చీకటి అలుముకుంటుంది. సూర్యకాంతి పూర్తిగా మరుగునపడడంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. సాధారణంగా కనిపించని నక్షత్రాలు, కొన్ని గ్రహాలు కూడా ఆకాశంలో స్పష్టంగా దర్శనమిస్తాయి. అందుకే ఈ ఖగోళ ఘట్టాన్ని శాస్త్రవేత్తలు, ఖగోళ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తుంటారు.
నాసా వివరాల ప్రకారం.. సూర్యుడి పరిమాణం చంద్రుడి కంటే దాదాపు 400 రెట్లు పెద్దది. అయితే, సూర్యుడు భూమికి చంద్రుడికంటే సుమారు 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉండటం వల్ల ఆకాశంలో రెండూ దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. ఈ కారణంగానే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేయగలుగుతాడు. ఈ అరుదైన ఖగోళ సమీకరణం వల్లే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సారి సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర రష్యా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం పరిధిలో స్పష్టంగా కనిపించనుంది. అలాగే, కెనడా, ఉత్తర అమెరికా, యూరప్‌లోని పలు దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.
భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం 2026 ఆగస్టు 12 రాత్రి 9.45 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 2.15 గంటల వరకు కొనసాగనుంది. ఈ మొత్తం వ్యవధిలో భారతదేశంలో రాత్రి కావడంతో సూర్యుడు కనిపించడు. అందువల్ల దేశంలోని ఏ ప్రాంతంలోనూ గ్రహణం దర్శనం ఇవ్వదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గ్రహణం భారత్‌లో కనిపించని కారణంగా సూతక్ కాలం వంటి ధార్మిక నియమాలు వర్తించవని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో పూజలు, నిత్యకైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంటున్నారు. అయితే, ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో అవకాశం ఉండనుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తదితర అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు తమ అధికారిక డిజిటల్ వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీంతో భారత్‌లో ఉన్నవారూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



