Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్‌డేట్ – ఆ ఒక్కటే మిగిలింది!
పూజా హెగ్డే టాలీవుడ్ కమ్‌బ్యాక్ మూవీ శ్రీశ్రీపై కొత్త అప్‌డేట్ వచ్చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి సంబంధించి కీలకమైన ఫారిన్ షెడ్యూల్‌ను మేకర్స్ కంప్లీట్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని అన్నారు.
Entertainment | Published On Aug 2, 2026, 8.26 pm IST
దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రీశ్రీ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శ్రీ శ్రీ నుంచి కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ ఆదివారం రివీల్ చేశారు. కీలకమైన ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే, దీక్షిత్ శెట్టిలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు డైరెక్టర్. ఈ ఫారిన్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా ఉండబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఫస్ట్ మూవీ...
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు తొలి పాట బొమ్మ బొమ్మకు అద్భుతమైన స్పందన లభిస్తోందని వెల్లడించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడం ఒక్కటే మిగిలిందని చెప్పారు. త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 44వ మూవీ ఇది. ఈ తెలుగు మూవీ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.
నేషనల్ అవార్డ్ విన్నర్...
శ్రీశ్రీ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా , ప్యారడైజ్ సినిమాల ఫేమ్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆచార్య తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది పూజా హెగ్డే. శ్రీ శ్రీతో పాటు తెలుగులో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంలో కాంచన 4లో హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్
- ●Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?
- ●Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?
- ●Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన
- ●Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Priyanka Chopra | ఆస్కార్ విన్నింగ్ యాక్టర్‌తో గ్లోబల్ స్టార్ రొమాన్స్ - హాలీవుడ్లో జాక్‌పాట్

Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?

Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?

Kangana Ranaut | యువతే దేశానికి బలమైన శక్తి.. జెన్‌జీ విషయంలో స్వరం మార్చిన కంగన






