Ashwini Manohar Paul | 100 అడుగుల లోయలోకి దూకి.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళా రెజ్లర్ ఆత్మహత్య
Ashwini Manohar Paul | జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (Ashwini Manohar Paul) ఆత్మహత్య చేసుకున్నారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి నల్దుర్గ్ కోట (Naldurg Fort) నుంచి 100 అడుగుల లోతైన లోయలోకి దూకేశారు. ఈ ఘటనలో అశ్విని, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఒక చిన్నారి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Ashwini Manohar Paul | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra)లోని ధారాశివ్ (Dharashiv) జిల్లా నల్దుర్గ్ కోట (Naldurg Fort) వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ ఒకరు తన ముగ్గురు పిల్లలతో కలిసి 100 అడుగుల లోతైన లోయలోకి దూకేసింది. ఈ ఘటనలో రెజ్లర్, ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
రెజ్లర్‌ను అశ్విని మనోహర్ పాల్ (Ashwini Manohar Paul)గా గుర్తించారు. అశ్విని తన ఐదేళ్ల కుమారుడు అజింక్య, రెండేళ్ల కవల కుమార్తెలు క్రాంతి, వీరతో కలిసి నల్దుర్గ్ కోట నుంచి లోయలోకి దూకేసినట్లు పోలీసులు తెలి పారు. ఈ ఘటనలో అశ్విని, అజింక్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో క్రాంతి చికిత్స పొందుతూ మృతి చెందగా.. వీర తీవ్ర గాయాలతో ప్రస్తుతం ధారాశివ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది.
భర్త, అత్తమామల నుంచి అశ్విని నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపించారు. అత్తింటి వేధింపులు తాళలేకే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశ్విని తండ్రి ఫిర్యాదు మేరకు నల్దుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అశ్విని జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో 5 స్వర్ణ, 6 రజత పతకాలను సాధించారు. రెజ్లింగ్ సర్కిల్స్‌లో ఆమెను మహారాష్ట్ర వాఘన్ అని పిలిచేవారు. అశ్విని మృతితో క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. అథ్లెట్, ఆమె పిల్లల మృతి పట్ల పలువురు క్రీడాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
హార్పర్ కొలిన్స్ చేతికి సోనియా గాంధీ ఆత్మకథ
‘అచ్చ’ కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష: మూల కార్యకర్తలకు మూలన సీటు.. వలస నేతలకే గెలుపు కిరీటమా?
వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్
తాజావార్తలు
- ●గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!
- ●Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్
- ●Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం
- ●RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి
- ●SIAM Sales Report | కార్లలో మహారాష్ట్ర.. బైక్‌లలో యూపీ.. SIAM రిపోర్ట్..
- ●POCO X8 Power 5G | 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

గాంధీ భవన్లో ‘పాత గురుతులు’.. పాలనలో ‘వలస వెలుగులు’: రేవంత్ మార్క్ కాంగ్రెస్‌లో అసలు కేడర్ ప్రశ్న!

Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ - అనసూయ కృష్ణాష్టమి డ్యాన్స్ వీడియో వైరల్

Minister Seethakka | ‘పచ్చ కాంగ్రెస్’ అనడం హాస్యాస్పదం

RTC Bus Accident | జుక్కల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా పడి డ్రైవర్ మృతి





