Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!
Road Accident | దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమైన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఖాటు శ్యామ్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని సొంతూరికి బయలుదేరిన ఓ కుటుంబం.. గమ్యస్థానానికి చేరకముందే విగతజీవులయ్యారు. రాజస్థాన్‌లోని కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- ఖాటు శ్యామ్ దర్శనం చేసుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదం
- రోడ్డుపక్కన ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన క్రూయిజర్ వాహనం
- నిద్రమత్తే ప్రమాదానికి కారణమన్న పోలీసులు
Road Accident | దైవ దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరుగుపయనమైన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఖాటు శ్యామ్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని సొంతూరికి బయలుదేరిన ఓ కుటుంబం.. గమ్యస్థానానికి చేరకముందే విగతజీవులయ్యారు. రాజస్థాన్‌లోని కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహారాష్ట్రకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. మరో ఆరుగురికి పైగా గాయపడ్డారు.
నిద్రమత్తులో అదుపుతప్పి..
చిత్తోర్‌గఢ్ జిల్లా శంభూపురా సమీపంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రైలర్‌ను యాత్రికులతో వెళ్తున్న క్రూయిజర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు క్రూయిజర్ పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారు వాహనం లోపలే చిక్కుకుపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్రూయిజర్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి ట్రైలర్‌ను ఢీకొట్టినట్లు అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) రాజేశ్ జోషి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన యాత్రికులు మొత్తం 36 మంది నాలుగు వాహనాల్లో ఖాటు శ్యామ్ దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం మహారాష్ట్రలోని ధార్ వైపు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మూడు వాహనాలు ముందుకు వెళ్లిపోగా.. ఒక క్రూయిజర్ వెనుకబడింది. శంభూపురా సమీపంలో ఈ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మిగిలిన వాహనాల్లోని వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించారు. ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
ఒక్క ఫోన్‌కాల్‌తో తెలిసిన విషాదం
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే వెనుక వస్తున్న బృందంలోని సభ్యులు ఆందోళనతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. బాధితుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాటు శ్యామ్ నుంచి ధార్‌కు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కొన్ని వాహనాలు వెనుకబడిపోయాయి. ఇంతలో తమ బృందంలోని ఓ మహిళ ఫోన్ చేసి ప్రమాదం జరిగినట్లు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నామని ఆయన తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు, సహచర యాత్రికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దేవుడి దర్శనం ముగించుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటారని ఎదురుచూసిన కుటుంబాలకు ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Rajasthan | Three dead and around 15 others injured after a car collided with a travel tempo in Jodhpur. The injured were rushed to Mathuradas Mathur Hospital and are undergoing treatment.
Mathuradas Mathur Hospital Superintendent, Vikas Rajpurohit says, "This is a family from Gujarat—members of the same family—who were likely traveling from Gujarat toward Ramdevra when their vehicle met with an accident. We received information about the incident around 7.00 PM and made all the necessary arrangements. So far, about 14-15 people have arrived here via four ambulances; this group includes three women and four children..."
— ANI (@ANI) November 22, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Passport Mela | తెలంగాణలో ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా.. ఒక్కరోజే 3,300 మందికి సేవలు
నవంబర్ 21, 2026

Padmavathi Temple | తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు.. పంచమితీర్థానికి ప్రత్యేక క్యూ లైన్లు
నవంబర్ 21, 2026

Team India | విదేశీ గడ్డపై టీమిండియా అరుదైన రికార్డు.. టాప్-5 బ్యాటర్లూ హాఫ్ సెంచరీలతో చరిత్ర
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!
- ●SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్?
- ●Horoscope | నవంబర్ 22 రాశి ఫలాలు.. తోబుట్టువులతో సంబంధాలలో అపార్థాలు ఏర్పడతాయి!
- ●Inter Board Merger Telangana | 55 ఏళ్ల ఇంటర్ వ్యవస్థకు ముగింపు.. బడిలో విలీనంతో లాభమా? నష్టమా?
- ●Passport Mela | తెలంగాణలో ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళా.. ఒక్కరోజే 3,300 మందికి సేవలు
- ●Sonia Gandhi Childhood Home Italy | మ్యూజియంగా ఇటలీలోని సోనియా గాంధీ పుట్టి పెరిగిన ఇల్లు

BOB Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. మరో 2 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు!

SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు.. మార్చి 18 నుంచి ఎగ్జామ్స్?

Horoscope | నవంబర్ 22 రాశి ఫలాలు.. తోబుట్టువులతో సంబంధాలలో అపార్థాలు ఏర్పడతాయి!

Inter Board Merger Telangana | 55 ఏళ్ల ఇంటర్ వ్యవస్థకు ముగింపు.. బడిలో విలీనంతో లాభమా? నష్టమా?



