త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Varsha Turkar | స్నేహితుడితో క‌ల‌సి బ‌య‌ట‌కు వెళ్లింది.. అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది..

Varsha Turkar | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి పండుగ‌కు (Diwali) పుట్టింటికి వెళ్లింది. పండుగ‌రోజున స్నేహితుడితో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లిన ఆమె అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) బాలాఘాట్‌లో జ‌రిగింది.

G

National | Published On Nov 16, 2026, 9.35 am IST

Varsha Turkar | స్నేహితుడితో క‌ల‌సి బ‌య‌ట‌కు వెళ్లింది.. అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది..
Advertisement

Varsha Turkar | త్రినేత్ర న్యూస్‌: దీపావ‌ళి పండుగ‌కు (Diwali) పుట్టింటికి వెళ్లింది. పండుగ‌రోజున స్నేహితుడితో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లిన ఆమె అట‌వీ ప్రాంతంలో శ‌వ‌మై క‌నిపించింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (Madhya Pradesh) బాలాఘాట్‌లో జ‌రిగింది. 35 ఏండ్ల వ‌ర్షా తుర్కార్ (Varsha Turkar) పుణె విమానాశ్ర‌యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ (IndiGo employee) టికెట్ కౌంట‌ర్‌లో ప‌నిచేస్తున్నారు. ఇండోర్‌కు చెందిన వ్య‌క్తితో 2024లో ఆమెకు వివాహ‌మైంది. వారికి రెండున్న‌రేండ్ల కుమార్తె ఉన్న‌ది.

కాగా, దీపావ‌ళి పండుగ కోసం వ‌ర్ష త‌న‌ కూతురుతో క‌లిసి బాలాఘాట్‌లో ఉన్న త‌న పుట్టింటికి వెళ్లారు. గ‌త శ‌నివారం (న‌వంబ‌ర్ 14న‌) సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో త‌న స్నేహితుడు నితేశ్‌ అగర్వాల్‌తో కలిసి వైన్‌గంగా నదీ తీరానికి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత, అక్కడ ఏదో ఘటన జరిగిందని వర్ష కుటుంబ సభ్యులకు అగర్వాల్ సమాచారం అందించారు. దీంతో వ‌ర్ష కుటుంబ స‌భ్యులు అత‌డు చెప్పిన ప్రాంతానికి వెళ్లిచూడ‌గా ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉంది. వెంట‌నే స‌మీపంలోని క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే ఆమె మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. వ‌ర్ష మృతదేహం లభించిన బొంద్రాని అటవీ (Bondrani Forest) ప్రాంతం మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని గోండియా జిల్లాలో ఉంది.

మృతురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. నితేశ్ అగ‌ర్వాల్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వర్షపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. విచార‌ణ సందర్భంగా ముసుగులో వ‌చ్చిన‌ గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేసి దోచుకున్నారని నితేశ్ చెప్పాడ‌న్నారు. అయితే, అగర్వాల్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడం, అతడి వాంగ్మూలంలో పొంతన లేని విషయాలు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు.. వివిధ కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement