త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్ – అన‌సూయ కృష్ణాష్ట‌మి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

ఇటీవ‌ల హిందూ మ‌తం, స‌నాత‌న ధ‌ర్మంపై యాంక‌ర్ అన‌సూయ చేసిన కామెంట్లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఆమెను నెటిజ‌న్లు గ‌ట్టిగా ట్రోల్ చేశారు. ఈ విమ‌ర్శ‌ల‌పై కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఓ డ్యాన్స్ వీడియోతో బ‌దులిచ్చింది.

N

Entertainment | Published On Sep 4, 2026, 3.32 pm IST

Anasuya | వివాదానికి వెరైటీగా పుల్‌స్టాప్  – అన‌సూయ కృష్ణాష్ట‌మి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌
Advertisement

Anasuya | జై శ్రీరామ్ నినాదంతో పాటు స‌నాత‌న ధ‌ర్మం గురించి ఇటీవ‌ల అన‌సూయ చేసిన కామెంట్లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకొని కొంద‌రు దాడుల‌కు, వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారంటూ పేర్కొన్నది. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత మ‌హిళ‌లు బొట్టు, గాజులు తీసేయాల‌నే సంప్ర‌దాయాల‌తో మార్పులు రావాలంటూ చెప్పింది. అనసూయ చేసిన కామెంట్లపై నెటిజన్లు ఆమెను గ‌ట్టిగానే ట్రోల్ చేశారు. హిందూ మ‌త వ్య‌తిరేకి అంటూ ఈ యాంక‌ర్‌ను విమ‌ర్శించారు. స‌నాత‌న ధ‌ర్మం విలువ తెలియ‌న‌ప్పుడు సైలెంట్‌గా ఉండాలి కానీ ఏది నోటికి వ‌స్తే అది మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదంటూ ఆమెపై ఫైర్ అయ్యారు.

వెరైటీగా ఆన్స‌ర్‌...

ఈ వివాదానికి వెరైటీగా ఆన్స‌ర్ ఇచ్చింది అన‌సూయ‌. కృష్ణాష్ట‌మి రోజు తులసి కోమలవేణి.. నీలవర్ణన రాణి.. నిత్య కల్యాణి అనే క‌న్న‌డ భ‌క్తి గీతానికి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ఎరుపు రంగు చీర క‌ట్టుకొని చేతుల‌కు నీలం రంగు పూసుకొని గోపిక గెట‌ప్‌లో అన‌సూయ క‌నిపించింది. పాట‌లోని భావాల‌కు త‌గ్గ‌ట్లుగా డ్యాన్స్ చేసింది.
క్ష‌మాగుణం, దేవుడిపై విశ్వాసం ప్ర‌తి మ‌నిషికి స‌హ‌జంగా ఉండే గుణం అంటూఈ వీడియోకు ఓ క్యాప్ష‌న్‌ను జోడించింది. కృష్ణుడికి అంతా తెలుసు అంటూ పేర్కొన్నది.

వీడియో వైర‌ల్‌...

అన‌సూయ పోస్ట్ చేసిన డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హిందూ ధ‌ర్మం విలువ, గొప్ప‌త‌నం గురించి తెలియ‌వంటూ ఇటీవ‌ల త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు ఈ వీడియోతో అన‌సూయ బ‌దులిచ్చింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. హిందూ దేవుళ్ల‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని ఈ డ్యాన్స్ వీడియోతో చెప్పింద‌ని అంటున్నారు.

నాగ‌బంధం...

గ‌త కొన్నాళ్లుగా సినిమాల విష‌యంలో అన‌సూయ సెలెక్టివ్‌గా అడుగులు వేస్తోంది. గ‌త ఏడాది రిలీజైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు త‌ర్వాత దాదాపు ఏడాది గ్యాప్ అనంత‌రం ఇటీవ‌లే నాగ‌బంధం సినిమా చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement
Advertisement