త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | నెత్తురోడిన ర‌హ‌దారులు.. 12 మంది దుర్మ‌ర‌ణం

Road Accident | రాజస్థాన్‌లో (Rajasthan) శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన రెండు ఘోర రోడ్డు ప్ర‌మాదాల్లో (Road Accident) 12 మంది మృతిచెందారు. కోటా-ఉద‌య్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై ఆగి ఉన్న ట్ర‌క్కును ఓ క్రూయిజ‌ర్ ఢీకొట్టింది. దీంతో 9 మంది మ‌ర‌ణించ‌గా, జోధ్‌పూర్‌లో కారు, ట్రావెల్ టెంపో ఢీకొని మ‌రో ముగ్గురు చ‌నిపోయారు. రెండు ప్ర‌మాదాల్లో క‌లిపి 21 మంది గాయ‌ప‌డ్డారు.

G

National | Published On Nov 22, 2026, 8.13 am IST

Road Accident | నెత్తురోడిన ర‌హ‌దారులు.. 12 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్‌: రాజస్థాన్‌లో (Rajasthan) శ‌నివారం అర్ధ‌రాత్రి జ‌రిగిన రెండు ఘోర రోడ్డు ప్ర‌మాదాల్లో (Road Accident) 12 మంది మృతిచెందారు. కోటా-ఉద‌య్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై ఆగి ఉన్న ట్ర‌క్కును ఓ క్రూయిజ‌ర్ ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మ‌ర‌ణించ‌గా, జోధ్‌పూర్‌లో కారు, ట్రావెల్ టెంపో ఢీకొని మ‌రో ముగ్గురు చ‌నిపోయారు. రెండు ప్ర‌మాదాల్లో క‌లిపి 21 మంది గాయ‌ప‌డ్డారు.

దైవ దర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా..

హారాష్ట్ర‌కు చెందిన ఓ కుటుంబం రాజ‌స్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఖాటూ శ్యామ్ (Khatu Shyamji) ఆల‌య దర్శనం ముగించుకుని తిరుగు ప‌య‌ణ‌మ‌యింది. ఈ క్ర‌మంలో ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో కోటా (Kota) జిల్లాలోని శంభుపురా (Shambhupura) గ్రామ స‌మీపంలో కోటా-ఉద‌య్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపై వారు ప్ర‌యాణిస్తున్న క్రూయిజ‌ర్ (Cruiser) వాహ‌నం.. రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో తొమ్మిది మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు కూడా ఉన్నారు.

ప్ర‌మాద స‌మ‌యంలో వాహనంలో మొత్తం 16 మంది ఉన్నారు. డ్రైవర్‌కు కునుకు రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు న‌మోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

జోధ్‌పూర్‌లో..

మ‌రో ఘ‌ట‌న‌లో జోధ్‌పూర్‌లో (Jodhpur) కారు, టెంపో ట్రావెల‌ర్ ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు మృతిచెంద‌గా, మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖానకు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంలో మృతిచెందిన‌వారు, గాయ‌ప‌డిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన‌వార‌ని అధికారులు తెలిపారు. వారంతా గుజ‌రాత్ నుంచి రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న రామ‌దేవ‌ర (Ramdevra Temple) ద‌ర్శ‌నానికి వెళ్లుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు.

Advertisement
Advertisement