Abhijeet Dipke | రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా..? దిప్కే సమాధానం ఇదే
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ ఓ ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే పనిచేస్తుందని (Will work as pressure group) స్పష్టం చేశారు.
Abhijeet Dipke | త్రినేత్ర.న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ ఓ ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే పనిచేస్తుందని (Will work as pressure group) స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో (Chhatrapati Sambhajinagar) CJP నిర్వహించిన రెండు రోజుల వ్యూహాత్మక సమావేశంలో భాగంగా దిప్కే ఇవాళ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా..? అనే ప్రశ్నకు దిప్కే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. “మేము రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో లేము. కానీ మీడియాకి దానిపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లుంది. మా సంస్థ ఒక ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే పని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే మా ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత దశలో భారత్ ఇదే ఉద్యమాన్ని కోరుకుంటోంది” అని దిప్కే స్పష్టం చేశారు.
కొత్త రాజకీయ పార్టీ కంటే దేశానికి ప్రజల ఉద్యమమే అవసరమని దిప్కే అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న అంశాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ భేదాలకు అతీతంగా ప్రజలు ఒక్కటై ఉద్యమించారని వ్యాఖ్యానించారు. తమ ఉద్యమం విజయవంతం కావడానికి అదే ప్రధాన కారణమని దిప్కే చెప్పుకొచ్చారు.
Also Read..
అసహ్యకరమైన కంటెంట్‌ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
ఎమర్జెన్సీకి ఇక కొత్త నంబర్.. డయల్ 112తోనే పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఓ యువ రైతు టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
ఆగస్టు 7, 2026

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
ఆగస్టు 6, 2026

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్‌నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
- ●Jupally Krishna Rao | కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి జూపల్లి

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?

స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!



