Super Glue | అమానుషం.. 9 నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోసిన మేనత్త
Super Glue | మహారాష్ట్ర పూణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన తొమ్మిది నెలల మేనల్లుడి నోట్లో ఫెవిక్విక్ (Super Glue) పోసింది. తీవ్ర అస్వస్థతతో చిన్నారి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Super Glue | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర పూణెలో అమానుష ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన తొమ్మిది నెలల మేనల్లుడి నోట్లో ఫెవిక్విక్ (Super Glue) పోసింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన పసికందు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని లోహెగావ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తండ్రి అల్తాఫ్ నదీమ్ షేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని సోదరి సానియా షేక్‌తోపాటూ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్తాఫ్ షేక్, అతని సోదరి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న సానియా.. చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బాలుడి నోట్లో ఫెవిక్విక్ పోసింది. దీంతో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత బాలుడి నోరు మూసుకుపోయింది.
ఆందోళన చెందిన బాలుడి తల్లి జైనబ్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలుడికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై చిన్నారి తల్లి జైనబ్.. సానియాను నిలదీయగా అసలు విషయం బయటపడింది. అయితే, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read..
సీఎం రేవంత్ మౌనమే.. చంద్రబాబుకు ధైర్యమా..?
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన 8 కాలేజీలు
సంబంధిత వార్తలు

Delhi | మైనర్‌పై గ్యాంగ్‌రేప్.. ఆపై హత్య.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు
సెప్టెంబర్ 18, 2026

Murder Case | చేతబడి అనుమానంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. మైనర్ సహా ఏడుగురు నిందితులు అరెస్ట్
సెప్టెంబర్ 4, 2026

Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



