Nitin Gadkari | అసహ్యకరమైన కంటెంట్‌ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
Nitin Gadkari | ఈ20 వివాదంలో (E20 fuel controversy) కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి (Nitin Gadkari) భారీ ఊరట లభించింది. గడ్కరీ, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసహ్యకరమైన, దూషణాత్మకమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను బాంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశించింది.
Nitin Gadkari | త్రినేత్ర.న్యూస్ : ఈ20 వివాదంలో (E20 fuel controversy) కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) భారీ ఊరట లభించింది. ఇథనాల్ కార్యక్రమంతో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గడ్కరీ న్యాయపోరాటానికి దిగిన విషయం తెలిసిందే. గత నెల బాంబే హైకోర్టు (Bombay High Court)ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తన కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గడ్కరీ, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన పోస్టులను వెంటనే తొలగించాలని మెటా, యూట్యూబ్, ఎక్స్ సహా ఇతర సంస్థలను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను అసహ్యకరమైన, దూషణాత్మకమైనదిగా కోర్టు అభివర్ణించింది. ఈ మేరకు గడ్కరీకి ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అదే సమయంలో వివాదాస్పద పోస్టులు, ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలకు అడ్డుకట్టవేయడంలో విఫలమైనందుకు మెటా, ఎక్స్, గూగుల్ వంటి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే అయినప్పటికీ, నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు, తప్పుడు కంటెంట్ సృష్టించడం చట్టపరమైన పరిమితులను దాటడమేనని కోర్టు స్పష్టం చేసింది.
ఇక విచారణ సందర్భంగా ఇథనాల్ బ్లెండింగ్ పాలసీని (Ethanol Blending Programme) రూపొందించి, అమలు చేస్తోంది కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అని గడ్కరీ కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమం తన ఆధీనంలో ఉన్న రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కిందకు రాదని వాదించారు. అదేవిధంగా తన కుమారుల వ్యాపారానికి మొత్తం ఇథనాల్ మార్కెట్‌లో చాలా స్వల్ప వాటా మాత్రమే ఉందని గడ్కరీ కోర్టుకు వివరించారు. పైగా ఆ సంస్థ రూ.1,600 కోట్ల అప్పుల్లో ఉందని స్పష్టం చేశారు. అయితే, సోషల్ మీడియాలో ఇథనాల్ మిశ్రమం వల్ల తన కుటుంబం లాభపడుతోందని నెటిజన్లు డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతూ తప్పుడు కంటెంట్ వ్యాప్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తన కుటుంబం లాభపడుతోందని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, అధికారిక ప్రభుత్వ రికార్డులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా పోస్టులు తనకు, తన కుటుంబ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని కోర్టుకు విన్నవించుకున్నారు.
Also Read..
ఐటీఆర్‌ను ఫైల్ చేశాక రిఫండ్ ఎప్పుడు వస్తుంది.. రాకపోతే ఏం చేయాలి..?
ఎమర్జెన్సీకి ఇక కొత్త నంబర్.. డయల్ 112తోనే పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు..
సంబంధిత వార్తలు

Nitin Gadkari | 135 నుంచి 89 కేజీలకు.. ఇదీ నితిన్ గడ్కరీ వెయిట్ లాస్ జర్నీ
ఆగస్టు 12, 2026

Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
ఆగస్టు 6, 2026

Arvind Kejriwal | ప్రధాని నివాసం వైపు ఆప్ చేపట్టిన మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు.. మేము టెర్రరిస్ట్‌లం కాదంటూ కేజ్రీవాల్ ఆగ్రహం
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



