Dial 112 | ఎమర్జెన్సీకి ఇక కొత్త నంబర్.. డయల్ 112తోనే పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలు..
Dial 112 | రాష్ట్రంలో అన్ని రకాల అత్యవసర సేవల (Emergency Helpline) కోసం కొత్త నంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు పోలీసు సేవల కోసం డయల్ 100, అంబులెన్స్ కోసం 108, ఫైర్ సేవల కోసం 101 వంటి నంబర్లు వినియోగంలో ఉన్నాయి.
Dial 112 | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో అన్ని రకాల అత్యవసర సేవల (Emergency Helpline) కోసం కొత్త నంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు పోలీసు సేవల కోసం డయల్ 100, అంబులెన్స్ కోసం 108, ఫైర్ సేవల కోసం 101 వంటి నంబర్లు వినియోగంలో ఉన్నాయి. అయితే వాటన్నింటికి గుడ్‌బై పలికిన ప్రభుత్వం కొత్తగా డయల్ 112ని (Dial 112) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇకపై అత్యవసర సేవల (Emergency Services) కోసం వేర్వేరు నంబర్లకు బదులు డయల్ 112 అనే ఒక్క నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోయింది.
ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం డయల్ 100కు కాల్ (Dial 100) చేసే విధానం అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (112)ను రాష్ట్రంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో అత్యవసర సమయంలో ప్రజలు 112కు కాల్ చేస్తే.. అవసరమైన సేవలను వెంటనే సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు.
ఇవికూడా..
కేవలం పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక సేవలే కాకుండా మహిళల భద్రత కోసం అమలులో ఉన్న 181, బాలల సంరక్షణ కోసం 1098, విపత్తు నిర్వహణ కోసం 1077 వంటి అన్ని ప్రధాన అత్యవసర సేవలు కూడా డయల్ 112లోనే పొందవచ్చు. దీంతో ఈ నంబర్లకు విడివిడిగా కాల్ చెయ్యాల్సిన అవసరం లేదు. 112కి కాల్ చేస్తే, సంబంధిత విభాగాలన్నీ యాక్టివేట్ అవుతాయి. 112 నంబర్‌కు కాల్ చేసిన వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వారి లొకేషన్‌ను జీపీఎస్ (GPS) ద్వారా గుర్తిస్తారు. లొకేషన్ ఆధారంగా సంఘటనా స్థలానికి అత్యంత సమీపంలో ఉన్న పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు లేదా అత్యవసర సిబ్బందికి సమాచారం అందించి వెంటనే సహాయం కోసం పంపుతారు. కాగా, స్మార్ట్‌ఫోన్లలో పవర్ బటన్‌ను వరుసగా 3 సార్లు నొక్కినా లేదా ఫీచర్ ఫోన్‌లలో 5 లేదా 9 నంబర్లను లాంగ్ ప్రెస్ చేసినా నేరుగా 112కు సమాచారం అందుతుంది.
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






