త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy family | టీవీకే చీఫ్ విజ‌య్ ఇంట గెలుపు సంబ‌రాలు.. వీడియో

Thalapathy family | టీవీకే చీఫ్ విజ‌య్ ఇంట గెలుపు సంబ‌రాలు షురూ అయ్యాయి. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా ఒక‌చోట చేరి విజిల్ ఊదుతూ సెల‌బ్రేట్ (Whistle celebrations) చేసుకున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో విజ‌య్ త‌ల్లిదండ్రులు ఇవాళ ఉద‌యం తిరుతాని ఆల‌యాన్ని సంద‌ర్శించారు.

D

National | Published On May 4, 2026, 1.06 pm IST

Thalapathy family | టీవీకే చీఫ్ విజ‌య్ ఇంట గెలుపు సంబ‌రాలు.. వీడియో
Advertisement

Thalapathy family | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ టీవీకే (TVK) పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను త‌ల‌కింద‌లు చేస్తూ స్ప‌ష్ట‌మైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఎన్నిక‌ల సంఘం అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం.. టీవీకే ప్ర‌స్తుతం 107 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. దీంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు, విజ‌య్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. అటు విజ‌య్ ఇంట్లో కూడా సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి.

ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా ఒక‌చోట చేరి విజిల్ ఊదుతూ సెల‌బ్రేట్ (Whistle celebrations) చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో విజ‌య్ త‌ల్లిదండ్రులు ఇవాళ ఉద‌యం తిరుతాని ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా త‌న కుమారుడికి అనుకూలంగా ఫ‌లితాలు రావాల‌ని అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Also Read..

సొంతంగానే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : టీవీకే

త‌మిళ‌నాట విజిల్ మోత‌.. ఆ గ్యారంటీలే టీవీకేకి క‌లిసొచ్చాయా..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరుగుతున్న సంతాన లోపం స‌మ‌స్య‌.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి అంటున్న WHO..

Advertisement
Advertisement