త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేష‌న్‌కు మ‌ద్ద‌తుపై భ‌గ్గుమ‌న్న విజ‌య్ పార్టీ

MK Stalin | కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు (Delimitation Bill) డీఎంకే (DMK) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంపై విజ‌య్ నేతృత్వంలోని టీవీకే (TVK) భ‌గ్గుమంది. ఎంకే స్టాలిన్ (MK Stalin)ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ టీవీకే ఐటీ వింగ్ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. స్టాలిన్‌ను 'సావర్కర్ 2.0'గా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న ఆర్ఎస్ఎస్ యూనిఫాం ధ‌రించిన చిత్రాల‌ను పోస్టు చేసింది.

D

National | Published On Nov 28, 2026, 3.58 pm IST

MK Stalin | స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫాం వేసిన టీవీకే.. డీలిమిటేష‌న్‌కు మ‌ద్ద‌తుపై భ‌గ్గుమ‌న్న విజ‌య్ పార్టీ
Advertisement

MK Stalin | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు (Delimitation Bill) డీఎంకే (DMK) మద్దతు ప్రకటించ‌డంపై తమిళనాడులో రాజకీయ వివాదం తలెత్తింది. డీఎంకే నిర్ణ‌యాన్ని విజ‌య్ నేతృత్వంలోని టీవీకే (TVK) తీవ్రంగా వ్య‌తిరేకించింది. ఈ మేర‌కు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను (MK Stalin) ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ టీవీకే ఐటీ వింగ్ ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టింది. స్టాలిన్‌ను 'సావర్కర్ 2.0'గా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న ఆర్ఎస్ఎస్ యూనిఫాం ధ‌రించిన చిత్రాల‌ను పోస్టు చేసింది. స్టాలిన్, ఉదయనిధి ఆర్ఎస్ఎస్ సభ్యులుగా ప్రమాణం చేస్తున్నట్లు రూపొందించిన యానిమేటెడ్ పోస్ట్‌ను పంచుకుంది. వారు పూర్తిగా సంఘీలుగా మారారని విమర్శించింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

కాగా, మోదీ ప్ర‌భుత్వం అత్యంత‌ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న (Delimitation) బిల్లుకు త‌మిళ‌నాడులోని డీఎంకే (DMK) పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న నిర్ణయాన్ని స్టాలిన్ స‌మ‌ర్థించుకున్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా 25 ఏళ్ల పాటు ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించడం, తమిళనాడు 7.18 శాతం సీట్ల వాటా తగ్గకుండా అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచడం వంటి తమ ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిందని తెలిపారు. 2024 అసెంబ్లీ తీర్మానంలో డీఎంకే లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను ఈ సవరించిన బిల్లు పరిష్కరించిందని, అందుకే ఈ బిల్లుకు తాము మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించారు. దీన్ని తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి లభించిన విజయంగా స్టాలిన్ పేర్కొన్నారు.

Also Read..

ఆ బిల్లు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం : ఖ‌ర్గే

పాఠ‌శాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి

మూసీ ప్రాజెక్టు: హరిత ప్రాంతాలు సగానికి తగ్గింపు.. రహదారులు 261 శాతం పెంపు!

Advertisement
Advertisement