TVK | సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : టీవీకే
TVK | రాష్ట్రంలో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీవీకే పార్టీ స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ తెలిపారు. డీఎంకే శకం ముగిందన్నారు. యువత, మహిళలు తమ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.
TVK | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజిల్ మోత మోగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీ ఏకంగా 106 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటికే విజయ్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నేపథ్యంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ (Felix Gerald) వెల్లడించారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. డీఎంకే శకం ముగిందన్నారు. ద్రావిడ పార్టీలతో (డీఎంకే, ఏఐఏడీఎంకే) ప్రజలు విసిగిపోయారని.. అందుకే మార్పు కోరుకున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు తమ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు. "ప్రజలు విజయ్‌పై నమ్మకం ఉంచారు. అందుకే ఈరోజు అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. దోపిడీ, అవినీతి, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్‌స్టాప్ పెట్టారు" అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టీవీకేకి అండగా నిలిచిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Also Read..
తమిళనాట విజిల్ మోత.. ఆ గ్యారంటీలే టీవీకేకి కలిసొచ్చాయా..?
సిల్వర్ స్క్రీన్ టూ సీఎం సీట్ - రాజకీయాల్లో చక్రం తిప్పిన టాప్ స్టార్లు వీళ్లే
త్రిష బర్త్‌డే ట్రీట్ - విశ్వంభర నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



