త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK | త‌మిళ‌నాట విజిల్ మోత‌.. ఆ గ్యారంటీలే టీవీకేకి క‌లిసొచ్చాయా..?

TVK | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజిల్ మోత మోగుతోంది. విజ‌య్ (Actor Vijay) స్థాపించిన టీవీకే పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజ‌య్ ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌లేదు. మ‌రింత ఉత్సాహం, ధైర్యంతో ముందుకు వెళ్లారు. అవినీతి రహిత పాలన, పారదర్శకతను విజయ్ తన నినాదాలుగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓట‌ర్ల మ‌న‌సు గెలుచుకున్నారు.

D

National | Published On May 4, 2026, 12.25 pm IST

TVK | త‌మిళ‌నాట విజిల్ మోత‌.. ఆ గ్యారంటీలే టీవీకేకి క‌లిసొచ్చాయా..?
Advertisement

TVK | త‌మిళ‌నాట విజ‌య్ (Actor Vijay) పార్టీ రాజ‌కీయ అరంగేట్రం కొత్త ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. పార్టీ స్థాపించిన రెండేళ్ల‌లోనే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన విజ‌య్ టీవీకే (TVK) పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఎర్లీ ట్రెండింగ్‌లో 106 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజ‌య్ ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. తిరిచురూప‌ల్లి, పెరంబూర్ స్థానాల్లో లీడింగ్‌లో కొన‌సాగుతున్నారు. ద‌శాబ్దాలుగా కేవ‌లం డీఎంకే, ఏఐఏడీఎంకే పాల‌న చుట్టూనే తిరుగుత‌న్న త‌మిళ రాజ‌కీయాల‌ను విజ‌య్ త‌న వ్యూహంతో త‌న‌వైపు తిప్పుకున్నారు. అతిత‌క్కువ స‌మ‌యంలోనే స‌త్తా చాటుతున్నారు.

ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా విజ‌య్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. క‌రూర్ తొక్కిస‌లాట‌, భార్య‌తో విడాకుల అంశం తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అయినా విజ‌య్ వాటిని ప‌ట్టించుకోలేదు. అవినీతి రహిత పాలన, పారదర్శకతను విజయ్ తన నినాదాలుగా మార్చుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓట‌ర్ల మ‌న‌సు గెలుసుకున్నారు. విజ‌య్ ఈ స్థాయిలో విజ‌యం సాధించ‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి. న‌టుడిగా ఆయ‌న‌కు త‌మిళ‌నాట మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు చాలా ఏళ్లుగా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల‌కు నిత్యం చేరువ‌లోనే ఉన్నారు. స‌మ‌స్య‌ల‌పై విజ‌య్ పోరాడే తీరు త‌మిళ ప్ర‌జ‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అదే ఇప్పుడు విజ‌య్ గెలుపుకు కార‌ణ‌మైంది. సామాజిక భద్రత, ధరల నియంత్రణ , మహిళా సాధికారతపై ఆయన ఇచ్చిన హామీలు గృహిణులను ఆలోచింపజేశాయి. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో విజయ్ వైపు మొగ్గు చూపడం ఆయన పార్టీకి అద్భుతమైన ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు విజ‌య్ ఇచ్చిన హామీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయ్ హామీలు ఇవే..

  • 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలందరికీ నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
  • ప్రతి కుటుంబానికి ఏటా 6 ఉచిత LPG సిలిండర్లు
  • గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
  • పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం 8 గ్రాముల బంగారంతో పాటు కానుక‌గా నాణ్యమైన పట్టుచీర
  • ప్ర‌తి ఇంటికి పైపుల ద్వారా 100 శాతం సురక్షితమైన తాగునీరు
  • వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ. 3,000కు పెంపు
  • ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల కోసం వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15,000 జమ
  • ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రూ.20 లక్షల వరకు విద్యా రుణాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు తమ సొంత గ్రామాల్లోనే ఉద్యోగాలు. వీరికి నెలకు రూ. 18,000 జీతం
  • కృత్రిమ మేధ ఆధారిత ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ల ఏర్పాటు
  • నిరుద్యోగ భృతి: గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 4,000 , డిప్లొమా/ఐటీఐ అభ్యర్థులకు రూ. 2,500 స్టైఫండ్
  • యువ పారిశ్రామికవేత్తలకు రూ.25 లక్షల వరకు ఎలాంటి హామీ లేని రుణాలు
  • మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు
  • ప్రభుత్వ ఉద్యోగులను పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను పరిశీలిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ
  • అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను రూ. 18,000కు పెంపు
  • మహిళల భద్రత రవాణా- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
  • ఆరోగ్యం - కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా
  • వరి క్వింటాలుకు రూ. 3,500 కనీస మద్దతు ధర (MSP)
  • 5 ఎకరాల లోపు రైతుల సహకార రుణాల 100% మాఫీ. అంతకంటే ఎక్కువ భూమి ఉన్న వారికి 50% రుణమాఫీ
  • కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 10,000 నేరుగా ఆర్థిక సాయం
  • వేట నిషేధ కాలంలో ఇచ్చే సాయం రూ. 27,000కు పెంపు

Also Read..

త‌మిళ‌నాట టీవీకే హ‌వా.. విజ‌య్ వెనుక‌ ప్ర‌శాంత్ కిషోర్‌..?

త్రిష బ‌ర్త్‌డే ట్రీట్ - విశ్వంభ‌ర నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్‌

బెంగాల్ ను గెల‌వాలే.. ఇదే మా ఆతృత‌: బండి సంజ‌య్

Advertisement
Advertisement