Infertility | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంతాన లోపం సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న WHO..
Infertility | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది సంతానలోపం సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సమస్య వస్తోంది. సాధారణంగా పురుషుల్లో వీర్యస్రావం సమస్యలు, వీర్యకణాల కొరత లేదా తక్కువ స్థాయి ఉండడం, వీర్యకణాల ఆకారం (మార్ఫాలజీ), కదలిక (మొటిలిటీ)లో లోపాలు పురుషుల్లో సంతాన లోపం సమస్యకు కారణమవుతున్నాయి.
Infertility | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది సంతానలోపం సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరికి ఈ సమస్య వస్తోంది. సాధారణంగా పురుషుల్లో వీర్యస్రావం సమస్యలు, వీర్యకణాల కొరత లేదా తక్కువ స్థాయి ఉండడం, వీర్యకణాల ఆకారం (మార్ఫాలజీ), కదలిక (మొటిలిటీ)లో లోపాలు పురుషుల్లో సంతాన లోపం సమస్యకు కారణమవుతున్నాయి. మహిళల్లో అండాశయాలు, గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యలు అధికంగా ఉండడం వల్ల సంతానం పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి అధికమవడానికి జీవశాస్త్ర మార్పులు, ఆధునిక జీవనశైలి, పర్యావరణ ప్రభావాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని WHO తెలియజేసింది.
కారణాలు ఇవే..
చాలామంది దంపతులు 30ల చివర లేదా 40లలో పిల్లలు కనాలని నిర్ణయించుకోవడం వల్ల అండాలు, వీర్యకణాల నాణ్యత సహజంగా తగ్గుతుంది. అలాగే స్థిరమైన జీవనశైలి, ఊబకాయం పెరగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి అంశాలు ఈ సమస్యకు దారితీస్తున్నాయి. అధిక బరువు హార్మోన్ల అసమతుల్యతకు కారణమై మహిళల్లో అండోత్సర్గాన్ని (ఓవ్యులేషన్) ప్రభావితం చేస్తోంది. పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గుతోంది. అలాగే పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యలను మరింత తీవ్రం చేస్తున్నాయి. పురుగుమందులు, భార లోహాలు, హార్మోన్లను ప్రభావితం చేసే రసాయనాలు వంటి కాలుష్యాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. యువ దంపతులు తమ పరిసరాల్లో ఉన్న కాలుష్యాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అవగాహన కలిగి ఉండాలి..
మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు హార్మోన్ సమతుల్యతను దెబ్బతీసి అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తాయి. పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరోన్ స్థాయిలు, అలాగే వరిబీజం వంటి పరిస్థితులు వీర్య నాణ్యతను తగ్గిస్తాయి. ఈ పరిస్థితిలో యువ దంపతులు జాగ్రత్తగా, అవగాహనతో ముందుకు సాగడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. మహిళల అండోత్సర్గ సమయం, గర్భధారణపై ప్రభావం చూపే అంశాలు తెలుసుకోవడం ముఖ్యమైనవి. అలాగే ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. సమతుల ఆహారం, నియమిత వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ తప్పనిసరి. పొగ తాగడం, అధిక మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం ఈ సమస్యను మరింత పెంచుతాయి.
నిర్లక్ష్యం చేయవద్దు..
పిల్లల్ని కనాలని దంపతులు భావిస్తే, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ముందస్తు నిర్ధారణతో సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే తాజా పరిశోధనలపై అవగాహన కలిగి ఉండటం కూడా అవసరం. ముఖ్యంగా, వయస్సు ప్రభావాన్ని గుర్తించాలి. ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకుంటే వచ్చే సవాళ్లను ముందుగానే అర్థం చేసుకోవాలి. స్త్రీ, పురుషుల్లో సంతాన లోపం సమస్య పెరుగుదల ఆందోళనకరమైన విషయం అయినప్పటికీ, దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకుని ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవగాహన, సరైన జీవనశైలి, సమయానికి వైద్య సలహా వల్ల సంతాన లోపం సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Eating Two Eggs A Day | నెల రోజుల పాటు రోజూ రెండు గుడ్లు తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నవంబర్ 23, 2026

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు ‘సైలెంట్ కిల్లర్స్’ ఇవే..!
నవంబర్ 14, 2026

Skin Care | చలికాలంలో చర్మం పొడిబారుతోందా..? ఈ జాగ్రత్తలు పాటించండి
నవంబర్ 8, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



