Priyanka Gandhi | ప్రియాంక గాంధీ ఎక్కడ..? వయనాడ్ దుర్ఘటన నేపథ్యంలో బీజేపీ
Priyanka Gandhi | ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై బీజేపీ (BJP) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. వయనాడ్‌లో కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడితే ప్రియాంక బాధిత ప్రాంతాన్ని ఇంతవరకూ సందర్శించలేదని ఆరోపించింది.
Priyanka Gandhi | కాంగ్రెస్ (Congress) ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై బీజేపీ (BJP) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు (Wayanad Landslide) విరిగిపడితే ప్రియాంక బాధిత ప్రాంతాన్ని ఇంతవరకూ సందర్శించలేదని ఆరోపించింది. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించలేదని విమర్శించింది. ప్రియాంక గాంధీ ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
జులై 7న వయనాడ్ జిల్లాలోని అనక్కంపోయిల్-మెప్పాడి సొరంగం (Tunnel) ప్రాజెక్ట్ నిర్మాణ పనుల వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగి వారం రోజులైనా ఆ ప్రాంతాన్ని ప్రియాంక సందర్శించకపోవడంపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. సోషల్ మీడియాలో పోస్టు తప్ప బాధితులు ఆమె ఏమాత్రం అండగా నిలవలేదని కేశవన్ తన పోస్టులో పేర్కొన్నారు.
వయనాడ్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని వ్యాఖ్యానించారు. వయనాడ్‌ను హస్తంపార్టీ రాజకీయ పావుగా వాడుకుంటోందని విమర్శించారు. గతంలో రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కూడా నియోజకవర్గంపై పెద్దగా శ్రద్ధ వహించలేదని వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి వయనాడ్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే రాజకీయ శైలి ప్రియాంక గాంధీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read..
కదులుతున్న రైల్లో పూజలు.. వైరల్ వీడియోపై నెట్టింట చర్చ
సంబంధిత వార్తలు

Teenmar Mallanna | సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా
ఆగస్టు 30, 2026

Congress Minister | కాంగ్రెస్ మంత్రి రాజీనామా.. ఆ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమే..!
ఆగస్టు 28, 2026

MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



