Indian Railways | వీటిని కూడా వదలట్లేదు.. రైల్వేల్లో 1.27 కోట్ల టవళ్లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ తెలుస్తే షాకే..
Indian Railways | రైళ్లలోని ఏసీ కోచ్‌లలో అందించే బెడ్‌రోల్స్ (bedrolls) చోరీకి గురవుతుండటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్లలోనే 1.27 కోట్ల లెనిన్ మాయమైనట్లు (Linen stolen) ఆర్‌టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రయాణ సమయంలో ఉచితంగా అందించే టవల్స్, బెడ్‌షీట్లు, పిల్లోస్‌ను ప్రయాణికులు తమతోపాటూ తీసుకెళ్లిపోతున్నారు. ఇలా చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.104 కోట్లపైమాటే.
Indian Railways | భారతీయ రైల్వేల్లో (Indian Railways) ప్రయాణించే ఏసీ కోచ్ ప్రయాణికులకు బెడ్‌రోల్ (bedrolls) ఉచితంగా లభిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ బెడ్‌రోల్‌లో ఒక పిల్లో, రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటి, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. అయితే, ఈ బెడ్‌రోల్ సామగ్రి భారీ స్థాయిలో చోరీకి గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా కనీసం 1.27 కోట్ల లెనిన్ మాయమైనట్లు (Linen stolen) ఆర్‌టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది.
1.27 కోట్ల బెడ్‌రోల్స్ చోరీ..
ప్రతి వెయ్యి మందిలో ఒకరు కనీసం ఒక్క బెడ్‌రోల్‌ను ప్రయాణం ముగిసిన తర్వాత తమతోపాటూ పట్టుకెళ్తున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. ఆ పరిశోధన ప్రకారం.. భారతీయ రైల్వేలోని మొత్తం 69 డివిజన్లలో సదరు వార్తాపత్రిక సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తులు దాఖలు చేసింది. ఈ దరఖాస్తుకు 54 డివిజన్ల ఉంచి సమాధానాలు వచ్చాయి. కొవిడ్ మహమ్మారి విజృంభణ అనంతరం 2022 జనవరి నుంచి 2026 మే వరకు కనీసం 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. వీటిని ప్రయాణికులే దొంగిలించారని అధికారులు తెలిపారు. 2022తో పోలిస్తే 2025 నాటికి ఇలాంటి దొంగతనాలు 56 శాతం పెరిగినట్లు వెల్లడైంది.
కాంట్రాక్టర్లకు రూ.104.5 కోట్ల నష్టం..
ఇక ఈ చోరీ కారణంగా గత నాలుగేళ్లలో బెడ్‌రోల్ కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు సదరు పరిశోధనలో తేలింది. నష్టపోయిన ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే కోచ్ అటెండెంట్ల జీతాల నుంచి రికవరీ చేస్తున్నట్లు సదరు సిబ్బంది చెబుతున్నారు.
46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయం..
ప్రయాణికులు చోరీ చేసిన వస్తువుల్లో ఫేస్ టవల్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. నాలుగేళ్లలో 46.54 లక్షల ఫేస్ టవల్స్ చోరీ అయ్యాయి. ఆ తర్వాత 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు, 2.76 లక్షల పిల్లోలు చోరీకి గురయ్యాయి. పిల్లోస్‌ను బ్యాగ్‌లో పెట్టుకోవడం కష్టతరం కావడంతో వాటి చోరీల సంఖ్య తక్కువగా ఉంది.
డివిజన్ల వారీగా..
రైల్వే డివిజన్ల వారీగా చూస్తే బికనీర్ డివిజన్‌లో అత్యధికంగా 25.76 లక్షల వస్తువులు చోరీకి గురయ్యాయి. తర్వాత రాంచీ (9.31 లక్షలు), ఢిల్లీ (8.21 లక్షలు), ముంబై (8.17 లక్షలు), జోధ్‌పూర్ (8.09 లక్షలు), అహ్మదాబాద్ (6.94 లక్షలు), దానాపూర్ (5.72 లక్షలు) డివిజన్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
వారిదే బాధ్యత..
ఈ వ్యవహారంపై రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దొంగతనాలను అరికట్టేందుకు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పంపిణీ బాధ్యత నిర్వహించే ఏజెన్సీలే ఈ వస్తువుల లెక్కలు చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కొరత ఏర్పడితే ఆర్థిక భారం కూడా వారిపైనే పడుతుందని రైల్వే ప్రతినిధి వివరించారు. ఇక ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read..
బ్యాంకులో ఈ స్పెషల్ ఖాతాను తెరవండి.. 15 ఏళ్లలో రూ.32 లక్షలు పొందవచ్చు..
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో టెక్నీషియన్ పోస్టులు.. 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ..
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



