Supreme Court | గోవధ నిషేధ ఉత్తర్వులపై స్టే సాధించిన విజయ్ ప్రభుత్వం
Supreme Court | తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో గోవధ నిషేధంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court)లో స్టే సాధించింది.
Supreme Court | తమిళనాడులో విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఆవులు, దూడలను వధించకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు (Madras High Court) ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులను సవరించాలని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా గోవధను నిషేధించాలంటూ (Cow Slaughter Ban Order) మే 27న మద్రాసు హైకోర్టు విజయ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1976 నాటి ఉత్తర్వు ఆధారంగా జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. అయితే, ఈ ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
నిర్దిష్ట ప్రాంతాల్లో ఆవుల వధకు చట్టం అనుమతించినప్పుడు, దానికి విరుద్ధంగా ఇచ్చిన ఈ ఆదేశాలు చెల్లవని విజయ్ ప్రభుత్వ వాదించింది. 1958 నాటి చట్టం ప్రకారం పశువు వయస్సు 10 ఏళ్లు దాటినా లేదా సంతానోత్పత్తికి, వ్యవసాయ పనులకు పనికిరాకుండా పోయినా కొన్ని పరిస్థితుల్లో పశువుల వధకు అనుమతి ఉంటుందని తెలిపింది. వాదనలు విన్న జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై తక్షణమే స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వులో సవరణ అవసరమని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Also Read..
రూ.1,100 పెన్షన్ కోసం వెళితే.. వృద్ధుడి ఖాతాలో రూ.759 కోట్లు
ఒక్క వాట్సాప్ మెసేజ్‌తోనే ఆయుష్మాన్ కార్డు.. కేంద్ర ప్రభుత్వ కొత్త సౌకర్యం..
తాజావార్తలు
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
- ●Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్‌లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు

CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..






