త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే సాగునీటికి క‌రువు : బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు

Ramchander Rao | కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ఘోర వైఫల్యం అని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎండగడుతూ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు బహిరంగ లేఖ రాశారు.

S

Telangana | Published On Jul 12, 2026, 3.27 pm IST

Ramchander Rao | కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం వ‌ల్లే సాగునీటికి క‌రువు : బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ఘోర వైఫల్యం అని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రామ‌చంద‌ర్ రావు మండిప‌డ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ఎండగడుతూ బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు బహిరంగ లేఖ రాశారు.

ఎన్డీఎస్ఏ నివేదికలను ఏమాత్రం పట్టించుకోకుండా, ఏకంగా మూడు వర్కింగ్ సీజన్లను వృథా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర కమిటీపై నెపం నెట్టడం సిగ్గుచేటు అని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నేడు ఉత్తర తెలంగాణ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు కరువైంది. తమ బాధ్యతలను విస్మరించి, నెపం ఇతరులపైకి నెట్టే కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని రామ‌చంద‌ర్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement