Bhagyashri Borse | సేమ్ సీన్ రిపీట్ – మలయాళ బ్యూటీ ప్లేస్‌లో భాగ్యశ్రీ బోర్సే – క్రేజీ ఛాన్స్ కొట్టేసిందిగా!
లెనిన్ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ హిట్లును అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ మూవీ మూడు రోజుల్లో 60 కోట్లకుపైగా వసూళ్లతో అదరగొడుతోంది. లెనిన్ సక్సెస్‌తో భాగ్యశ్రీ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం.
Entertainment | Published On Jul 13, 2026, 1.44 pm IST
Bhagyashri Borse | టాలీవుడ్‌లో ఓ హిట్టు అందుకోవాలనే భాగ్యశ్రీ బోర్సే కల ఎట్టకేలకు లెనిన్‌తో నెరవేరింది. ఇప్పటివరకు తెలుగులో నాలుగు సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. మంచి పేరొచ్చిన సక్సెస్ మాత్రం దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణకు లెనిన్‌తో తెరపడింది. సినిమాతో పాటు తన పాత్రకు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యింది. లెనిన్ సక్సెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. లెనిన్ విజయాన్ని ఆస్వాదిస్తోన్న ఈ అమ్మడు తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రీతి ముకుందన్‌ను అనుకొని...
శర్వానంద్ హీరోగా సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. తొలుత మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఈష్యూ వల్ల చివరి నిమిషంలో ప్రీతి ముకుందన్ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను మేకర్స్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. త్వరలోనే శర్వానంద్ మూవీ సెట్స్‌లో భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టబోతున్నట్లు తెలిసింది.
సేమ్ సీన్...
లెనిన్‌లో కూడా శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించింది. శర్వానంద్ సినిమాలో సేమ్ సీన్ రిపీట్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది. శర్వానంద్, శ్రీనువైట్ల మూవీలో మోడ్రన్ అమ్మాయిగా భాగ్యశ్రీ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
రవీనా టాండన్...
శర్వానంద్, శ్రీనువైట్ల మూవీలో సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో ఈ బాలీవుడ్ యాక్టర్ నటిస్తోన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మూడు రోజుల్లో 60 కోట్లు...
లెనిన్‌లో భారతి అనే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయిగా భాగ్యశ్రీ బోర్సే నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఎమోషనల్ రోల్ అద్భుత నటనను ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 60 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాతోనే కెరీర్‌లో తొలి బ్లాక్‌బస్టర్‌ను అఖిల్ అందుకున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న – ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్
ఆగస్టు 30, 2026

Mla Raja Singh | అశ్లీలత, అసభ్యత తప్ప కథ లేదు – యశ్ టాక్సిక్‌పై ఎమ్మెల్యే రాజా సింగ్ కామెంట్స్
ఆగస్టు 30, 2026

Allari Naresh | భక్తి కథతో అల్లరి నరేష్ మూవీ – హీరోయిన్‌గా కాజల్ – షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓటీటీ డీల్ క్లోజ్
ఆగస్టు 30, 2026
తాజావార్తలు
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
- ●Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్‌లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు

CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..



