Puja held inside moving train | కదులుతున్న రైల్లో పూజలు.. వైరల్ వీడియోపై నెట్టింట చర్చ
Puja held inside moving train | కదులుతున్న రైలు బోగీలో పూజలు చేస్తున్న (Puja held inside moving train) వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. వైరల్ వీడియోపై నార్తర్న్ రైల్వే (Northern Railways) క్లారిటీ ఇచ్చింది. అది సాధారణ ప్రయాణికుల బోగీ కాదని.. ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ (saloon car) అని వెల్లడించింది.
Puja held inside moving train | మొన్నటికి మొన్న ఓ రైల్లోని ఏసీ బోగీని శోభనం గదిలా మార్చిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన మరవకముందే రైల్లోని బోగీలో పూజలు చేస్తున్న (Puja held inside moving train) వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో కదులుతున్న రైలు సెలూన్ కార్ (saloon car)లో పంతులు పూజలు చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. రైల్లో మతపరమైన కార్యక్రమాలు ఏంటి..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఉందా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
దీనిపై నార్తర్న్ రైల్వే (Northern Railways) స్పందించింది. ఈ మేరకు వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చింది. అది సాధారణ ప్రయాణికుల బోగీ కాదని.. ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని వెల్లడించింది. "కొందరు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ ద్వారా సెలూన్ కారును జులై 8న బుక్ చేసుకున్నారు. అందుకోసం వాళ్లు రూ.3,08,580 అడ్వాన్స్ చెల్లించారు. జులై 10న ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ (Paschim Express)కు ఈ సెలూన్ కార్‌ను జతచేశాం" అని స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది.
ट्रेन में नमाज़ पढ़ने पर भावनाएं आहत हो जाती हैं...
ट्रेन के केबिन में हनीमून का सरप्राइज देने पर संस्कृति खतरे में आ जाती है और TTE सस्पेंड हो जाता है...
लेकिन जब भारतीय रेलवे के एक वीआईपी सैलून कोच (Saloon Coach) के अंदर बकायदा पंडितों को बुलाकर, चलती ट्रेन में पूरा तामझाम… pic.twitter.com/7use0bmfde
— Sudhanshu Yadav (@SocialistSpirit) July 12, 2026
Also Read..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IRCTC | ఒక్క టూర్లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
ఆగస్టు 29, 2026

Vande Bharat Sleeper | వందే భారత్ స్లీపర్ అప్‌గ్రేడ్.. ఇక 24 బోగీలతో పరుగులు..!
ఆగస్టు 23, 2026

RRB Recruitment | 3993 పోస్టులతో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్.. దరఖాస్తులు షురూ..
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



