Airtel | ఎయిర్‌టెల్ ఉచిత పర్‌ప్లెక్సిటీ ప్రో వాడుతున్నారా.. ఇలా చేయకపోతే రూ.17వేలు చెల్లించాల్సి వస్తుంది..
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఏడాది క్రితం అందించిన ఉచిత పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ ఆఫర్‌కు సపోర్ట్ ను మరో కొద్ది రోజుల్లో నిలిపివేయనుంది. గతేడాది ఎయిర్‌టెల్, పెర్‌ప్లెక్సిటీ కలిసి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్, వై-ఫై ప్లాన్‌లతో కలిపి సుమారు రూ.17వేల విలువైన ఒక సంవత్సరం ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించాయి.
Technology | Published On Jul 13, 2026, 1.40 pm IST
Airtel | టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఏడాది క్రితం అందించిన ఉచిత పెర్‌ప్లెక్సిటీ ప్రో ఏఐ ఆఫర్‌కు సపోర్ట్ ను మరో కొద్ది రోజుల్లో నిలిపివేయనుంది. గతేడాది ఎయిర్‌టెల్, పెర్‌ప్లెక్సిటీ కలిసి పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్, వై-ఫై ప్లాన్‌లతో కలిపి సుమారు రూ.17వేల విలువైన ఒక సంవత్సరం ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించాయి. ఇప్పుడు ఆ ఆఫర్ గడువు ముగియడంతో, ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగిస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారులకు రెన్యువల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లు వస్తున్నాయి. అంటే, సేవను కొనసాగించాలనుకుంటే ఇకపై చెల్లింపు చేయాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ ఉచిత పెర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్‌ను పొందిన వినియోగదారులకు ఈ సందేశం కనిపిస్తోంది. వార్షిక పెర్‌ప్లెక్సిటీ సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్‌కు సిద్ధంగా ఉందని, ఈ సేవను కొనసాగించకూడదనుకుంటే, రెన్యువల్ తేదీకి ముందు ఆటో-రెన్యువల్‌ను రద్దు చేయాలని, లేకపోతే అదనపు ఛార్జీలను విధిస్తారని ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు సందేశాలను పంపిస్తోంది.
ఎలా రద్దు చేయాలి..
సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలంటే పెర్‌ప్లెక్సిటీ యాప్‌లోకి వెళ్లి, ప్రొఫైల్ విభాగాన్ని తెరిచి వ్యూ డీటెయిల్స్ ద్వారా అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు. అయితే ఈ ఉచిత ఆఫర్ ముగియడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే గతేడాది డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ నిబంధనలను వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్చింది. ఆ సమయంలో యాక్షన్ రిక్వైర్డ్: యాడ్ ఎ కార్డ్ టు కీప్ యువర్ పెర్‌ప్లెక్సిటీ ప్రో ట్రయల్ అనే సబ్జెక్ట్‌తో వినియోగదారులకు ఈ-మెయిల్ పంపింది. ఉచిత ఏఐ ఆఫర్‌ను దుర్వినియోగం కాకుండా కాపాడేందుకే ఈ మార్పులు చేశామని కంపెనీ తెలిపింది. అలాగే ట్రయల్ కొనసాగించాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పేమెంట్ విధానాన్ని జోడించాలని పేర్కొంది. ట్రయల్ గడువు ముగిసిన తర్వాత మాత్రమే కార్డుపై ఛార్జీలు పడతాయని, వినియోగదారు ముందుగానే రద్దు చేయకపోతే సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుందని కూడా స్పష్టం చేసింది.
కార్డు వివరాలను ఇచ్చి ఉంటేనే..
కాబట్టి ఎప్పుడూ కార్డు వివరాలను జోడించకపోతే ఈ నోటిఫికేషన్‌ను పట్టించుకోనవసరం లేదు. కానీ ఇప్పటికే కార్డు వివరాలను నమోదు చేసి ఉంటే, బిల్లు పడకముందే పెర్‌ప్లెక్సిటీ ప్రో అకౌంట్ పేజీలోకి వెళ్లి సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడం మంచిది. మొదట్లో ఎలాంటి కార్డు వివరాలు అవసరం లేదని చెప్పి ఉచిత ఆఫర్‌ను ప్రకటించి, కొన్ని నెలల తర్వాత ఆ నిబంధనలను మార్చడం చాలామంది వినియోగదారులకు అసంతృప్తి కలిగించింది. ముఖ్యంగా ఆ షరతులను నమ్మి సేవలో చేరిన వారు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ఈ పెర్‌ప్లెక్సిటీ ప్రో ఉచిత ఆఫర్ ద్వారా వినియోగదారులు సుమారు రూ.17వేల విలువైన ప్రీమియం ఫీచర్లను ఉపయోగించారు. ఇందులో వేల సంఖ్యలో సెర్చ్‌లు చేయడం, జీపీటీ 4.1, జెమిని, క్లాడ్ వంటి వివిధ ఏఐ మోడళ్లను ఎంపిక చేసుకోవడం, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి విశ్లేషించడం, అలాగే డాల్-ఈ, ఫ్లక్స్ వంటి మోడళ్లతో ఏఐ చిత్రాలను రూపొందించడం వంటి సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా మంది ఈ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను వాడడం లేదు. కార్డులను జోడించని అకౌంట్లను పర్‌ప్లెక్సిటీ ఎప్పుడో నిలిపివేసింది. అందువల్ల కార్డులను జోడించి వాడుతున్నవారు తమకు ఈ ప్లాన్ వద్దనుకుంటే వెంటనే రద్దు చేయాల్సి ఉంటుంది. లేదంటే అనవసరంగా చార్జీలను భరించాల్సి వస్తుంది.
సంబంధిత వార్తలు

Chamala Kiran Kumar Reddy | సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీది కీలకపాత్ర: ఎంపీ చామల
ఆగస్టు 29, 2026

Microsoft | మైక్రోసాఫ్ట్‌కు తొలి వెరా రూబిన్ ఏఐ ప్లాట్‌ఫామ్.. కీలక మైలురాయి..
ఆగస్టు 22, 2026

OpenAI | చాట్ జీపీటీ ఇక మరింత వేగవంతం.. అప్‌గ్రేడ్ చేసిన ఓపెన్ ఏఐ..
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు



