Road Accident | ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. ఆరుగురు మృతి
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గాయపడ్డారు.
Road Accident | తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. మధురై-తిరుచ్చి జాతీయ రహదారి (Trichy-Madurai Highway)పై రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వాంచినగరం బస్టాప్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు చెన్నై నుంచి కన్యాకుమారిలోని మార్తాండ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో వాంచినగరం బస్టాప్ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి.. మధురై నుంచి తిరుచ్చి వైపు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును బలంగా ఢీ కొట్టి పక్కనే ఉన్న బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. ప్రైవేటు బస్సు చాలా బలంగా ఢీకొట్టడంతో ప్రభుత్వ బస్సు సైతం రోడ్డుపై బోల్తాపడింది. ఈ ఘటనలో బస్టాప్ వద్ద నిద్రిస్తున్న ఓ వ్యక్తి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 41 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మేలూరు, మధురైలోని ఆసుపత్రులకు తరలించారు. ఇక మృతులు తిరుచ్చికి చెందిన పి. ఆనందరాజ్ (46), జి. సూర్య (29), తిరువారూర్‌కు చెందిన కె. మహమ్మద్ యాసిన్ (60), తిరునెల్వేలికి చెందిన జె. సిరియాపుష్పం (56), జె. అబ్రహంగా గుర్తించారు. వీరితో పాటు ప్రమాదం జరిగిన సమయంలో వాంచినగరం బస్టాప్ వద్ద నిద్రిస్తున్న కొట్టాంపట్టికి చెందిన సి. పెరుమాళ్ (70) కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మేలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
VIDEO | Madurai, Tamil Nadu: Five killed and over 40 injured after an Omni bus collided with TNSTC bus near Melur. More details are awaited.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/YDPucO5ppo
— Press Trust of India (@PTI_News) July 13, 2026
Also Read..
బ్యాంకులో ఈ స్పెషల్ ఖాతాను తెరవండి.. 15 ఏళ్లలో రూ.32 లక్షలు పొందవచ్చు..
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు






