త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం జూలై 19న ఆల్-పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చింది. పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

J

National | Published On Jul 12, 2026, 6.02 pm IST

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

సంక్షిప్త సారాంశం

జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికంటే ఒక రోజు ముందు (జూలై 19న) కేంద్రం ఆల్-పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. జుడీషియల్ కస్టడీలో 30 రోజులు ఉంటే పీఎం, సీఎంలు, మంత్రులు తమ పదవులను కోల్పోయేలా తీసుకొస్తున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై తీవ్ర చర్చ జరగనుంది. నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారం, ఆపరేషన్ సింధూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. సమావేశాలకు ముందే టీఎంసీ, శివసేన (UBT), ఆప్ పార్టీల నుంచి భారీగా ఎంపీలు ఫిరాయించడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.

Advertisement

Parliament All Party Meeting | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Session) జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు అంటే జూలై 19న ఉదయం 11 గంటలకు కేంద్రం ఆల్-పార్టీ మీటింగ్ (సర్వసభ్య సమావేశం) ఏర్పాటు చేయనుంది. ఈ సెషన్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లుల అజెండాతో పాటు విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ఈ సాంప్రదాయక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు ఉభయ సభల సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సెషన్‌లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విపక్షాల అస్త్రాలు.. హీటెక్కనున్న సభ

ఈసారి వర్షాకాల సమావేశాలు అత్యంత బిజీగా సాగడంతో పాటు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET-UG) పేపర్ లీక్ ఉదంతంపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ఉంది.

దీనికి తోడు, 'ఆపరేషన్ సింధూర్'లో ప్రాణనష్టానికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై ఇప్పటికే బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ (సభ హక్కుల ఉల్లంఘన) నోటీసును కూడా ఇచ్చింది. దీంతో సభలో రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆ ఒక్క నిబంధన.. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్

ఈ సెషన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ప్రధానాంశం.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు (130th Constitution Amendment Bill). ఈ ప్రతిపాదిత చట్టంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) జూలై 17న తన నివేదికను ఖరారు చేసి సభ ముందుంచనుంది.

ఈ బిల్లులోని ఒక నిబంధన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని ప్రకారం.. తీవ్రమైన నేరారోపణల కేసుల్లో ప్రధాని (Prime Minister), ముఖ్యమంత్రులు (Chief Ministers) లేదా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే.. వరుసగా 30 రోజుల పాటు జుడీషియల్ కస్టడీలో (Judicial Custody) ఉంటే, వారు ఆటోమేటిక్‌గా తమ పదవులను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రూల్ గనుక చట్టంగా మారితే దేశ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయం.

మారిన పొలిటికల్ ఈక్వేషన్స్.. ఫిరాయింపుల కలకలం

ఈ పార్లమెంట్ సమావేశాలపై ఇటీవల జరిగిన రాజకీయ ఫిరాయింపుల ప్రభావం కూడా గట్టిగా పడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) లో విలీనమయ్యారు. తమకు లోక్‌సభలో ప్రత్యేక సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ చేయాలని కూడా కోరారు. అలాగే ముగ్గురు టీఎంసీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

మరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (UBT) కు కూడా గట్టి షాక్ తగిలింది. ఆరుగురు లోక్‌సభ ఎంపీలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ భారీ మార్పుల మధ్య ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సెషన్స్ (Parliament sessions) ఎంతవరకు సజావుగా సాగుతాయో చూడాలి మరి!

Advertisement
Advertisement