త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Ravindar Rao | ఎవ‌డ్రా నీ మాట‌ల‌కు వెరిసేది.. ఎవ‌న్నిరా నువ్ కోసేది?

MLC Ravindar Rao | కేసీఆర్ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే.. మూడేళ్లలో రిపేర్ చేయలేకపోయావా? అని ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ళ్లి ర‌వీంద‌ర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర‌య్యారు. ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పే నువ్వు మూడేండ్ల‌లో మేడిగ‌డ్డ రిపేర్ ఎందుకు చేయ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Jul 13, 2026, 1.20 pm IST

MLC Ravindar Rao | ఎవ‌డ్రా నీ మాట‌ల‌కు వెరిసేది.. ఎవ‌న్నిరా నువ్ కోసేది?
Advertisement
  • ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింద‌ని ఎన్నిసార్లు చెప్తార్రా స‌న్నాసుల్లారా
  • ఇక్క‌డ భ‌య‌ప‌డేవాడు ఎవ‌డూ లేడు
  • బిడ్డా రేవంత్.. నీ అంతు తేలుస్తం
  • సీఎం రేవంత్‌పై నిప్పులు క‌క్కిన‌ ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ళ్లి ర‌వీంద‌ర్‌రావు

త్రినేత్ర‌.న్యూస్‌: కేసీఆర్ మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే.. మూడేళ్లలో రిపేర్ చేయలేకపోయావా? అని ఎమ్మెల్సీ త‌క్కెళ్ల‌ప‌ళ్లి ర‌వీంద‌ర్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర‌య్యారు. ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పే నువ్వు మూడేండ్ల‌లో మేడిగ‌డ్డ రిపేర్ ఎందుకు చేయ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. పైగా జైళ్లో పెడ‌తా, కోస్తా అని మాట్లాడితే బెద‌ర‌డానికి ఇక్క‌డ ఎవ‌డూ లేర‌న్నారు. ఎవ‌డ్రా నీ మాట‌ల‌కు వెరిసేది.. ఎవ‌న్నిరా నువ్ కోసేది అంటూ నిప్పులు క‌క్కారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఊగిపోయారు.

అవ‌న్నీ క‌లిపితే క‌దరా కాళేశ్వ‌రం..

ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింద‌ని చెప్త‌వ్‌.. ఎన్నిసార్లు చెప్తార్రా ప‌నికిమాలిన స‌న్నాసుల్లారా? మూడు సంవ‌త్స‌రాలళ్ల‌ క‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజీలు, 15 రిజ‌ర్వాయ‌ర్లు, 19 స‌బ్‌స్టేష‌న్లు, 21 పంప్‌హౌస్‌లు, 200 కిలోమీట‌ర్ల ట‌న్నెల్‌, 1531 కిలోమీట‌ర్ల కాల్వ‌లు క‌లిపితే క‌దరా కాళేశ్వ‌రం అనేది. 94 వేల కోట్ల రూపాయ‌లు వీట‌న్నిటికి ఖ‌ర్చు పెడితే, ఇన్ని వేల ఎక‌రాల‌ను ఎక్వేష‌న్ చేస్తే, ఇన్ని రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మిస్తే ఒక్క మేడిగ‌డ్డ ద‌గ్గ‌ర కుంగిన పిల్ల‌ర్ల‌ను రిపేర్ చేయ‌లేక మూడు సంవ‌త్స‌రాల‌కు తీసుకొస్తున్న‌వ్ క‌దా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

నీ చిల్ల‌ర భాష‌తోటి అవ‌మానాల పాలు చేస్తివిగ‌ద‌రా?

ఊరికే వ‌చ్చిన‌యా ప‌ర్మిష‌న్లు.. డీపీఆర్‌లు లేకుండా, అనుమ‌తులు లేకుండా నిర్మించామా? 18 కేంద్ర సంస్థ‌ల ద్వారా అనుమ‌తులు తీసుకొని నిర్మించిందిరా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అంటే. ఊరికెనే ఆషామాషీగా నిర్మించ‌లే. అన్ని అనుమ‌తులు తీసుకొన్నం. కానీ నీ రిపేర్‌కు ఇంత స‌మ‌యం ప‌ట్టిందెందుకు? మూడేండ్ల‌ళ్ల ఇన్ని బ్యారేజీలు, ఇన్ని రిజ‌ర్వాయ‌ర్లు, ట‌న్నెల్స్ ఇంకా ఎన్నోక‌లిపి ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయేలా క‌ట్టినం. 240 మెగావాట్ల‌కు సంబంధించి మోట‌ర్లను బిగించి పంపింగ్ చేస్తే ఊరికెనే తృణ‌ప్రాయంగా, చిల్ల‌ర‌గా.. నీ చిల్ల‌ర భాష‌తోటి అవ‌మానాల పాలు చేస్తివిగ‌ద‌రా? అని ధ్వ‌జ‌మెత్తారు.

మూసుకొని ఉండే అమాయ‌కులు తెలంగాణ బిడ్డ‌లు కాదు..

ఎవ‌డ్రా నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది.. ఎవ‌డ్రా నీ మాట‌ల‌కు వెరిసేది.. పెట్టు బిడ్డ పెట్టు. యావ‌త్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఎడారిగా మారుస్తానంటే ఈ ఆంధ్రాతొత్తుల‌కు, గురువుల‌కు ఇయ్యాళ భ‌ర‌ణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయ‌కులు తెలంగాణ బిడ్డ‌లు కాదు. నీ అంతు తేల్చ‌డానికి సిద్ధంగా ఉన్న‌రు.

ఎవ‌నికిరా నువ్ జైల్ల పెడుతా అని బెదిరింపులు చేసేది? ఎవ‌న్నిరా నువ్ కోసేది? అదృష్టం కొద్ది ముఖ్య‌మంత్రివి అయినంత మాత్రానా ఎగిరిప‌డుతున్న‌వ్‌. ముఖ్య‌మంత్రి అనేది ప్ర‌జ‌లు ఇచ్చిన గౌర‌వ‌మ‌ది. రాజ్యాంగ‌బ‌ద్ధంగా క‌ల్పించిన ఒక బాధ్య‌త‌, అవ‌కాశం. దాన్ని మ‌రిచి బెదిరిస్తావా? బెదిరింపుల‌కు పాల్ప‌డ‌తావా? ఖ‌బ‌ర్దార్ బిడ్డా నీ బెదిరింపుల‌కు ఇక్క‌డ ఎవ‌డూ భ‌య‌ప‌డేవాడు లేడు. ఎవ‌రు బెదిరేవాళ్లు కూడా లేరు అని త‌న‌దైన శైలిలో ర‌వీంద‌ర్‌రావు విరుచుకుప‌డ్డారు.

Advertisement
Advertisement