Supreme Court | గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు..
Supreme Court | పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై (Banakacherla) సుప్రీంకోర్టులో (Supreme Court) తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, ఇంజన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్: పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై (Banakacherla) సుప్రీంకోర్టులో (Supreme Court) తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయాలని, ఇంజన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం (Telangana) వేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టించింది. ఈ సందర్భంగా ప్రధాన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా లిస్ట్ అయ్యిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ 15 మందిలో ఏపీకి మాత్రమే ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అయితే లోపాలు సరిదిద్దాక విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది. పిటిషన్‌పై విచారణ జరపకుండా ప్రతివాదులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..
- ●Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ●Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన
- ●EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?
- ●Fahadh Faasil | పుష్ప విలన్‌తో రాజమౌళి కొడుకు తెలుగు హారర్ కామెడీ మూవీ - హీరోయిన్ లేకుండా ప్రయోగం
- ●Supreme Court | అయోధ్య విరాళాల చోరీపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు

Iran Hit List | ఇరాన్ హిట్‌లిస్ట్.. జాబితాలో ట్రంప్, నెతన్యాహు, మెలోనీ, మాక్రాన్..

Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Maktal | మక్తల్ - నారాయణపేట.. రూ. 237 కోట్లతో నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు శంకుస్థాపన

EPFO | కొత్త ఈపీఎఫ్‌వో వ్యవస్థలో వచ్చిన 13 మార్పులు ఇవే.. ఏమేం సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటే..?




