త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Ocean | యుద్ధం మ‌రింత తీవ్రం.. హిందూ మ‌హాస‌ముద్రంలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

Indian Ocean | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగిస్తుండ‌గా.. ఇరాన్ సైతం ప్ర‌తిదాడులు చేస్తోంది. తాజాగా ఈ యుద్ధం మ‌ధ్య ప్రాచ్యం నుంచి హిందూ మ‌హా స‌ముద్రానికి విస్త‌రించింది.

D

National | Published On Mar 21, 2026, 11.59 am IST

Indian Ocean | యుద్ధం మ‌రింత తీవ్రం.. హిందూ మ‌హాస‌ముద్రంలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు
Advertisement

Indian Ocean | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొన‌సాగిస్తుండ‌గా.. ఇరాన్ సైతం ప్ర‌తిదాడులు చేస్తోంది. తాజాగా ఈ యుద్ధం మ‌ధ్య ప్రాచ్యం నుంచి హిందూ మ‌హా స‌ముద్రానికి విస్త‌రించింది. ఆ స‌ముద్రంపైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది (Iran Fires Missiles At Indian Ocean). చాగోస్ దీవుల్లో ఉన్న అమెరికా-యూకే మిలిట‌రీ బేస్ (US-UK military base) డీగో గార్సియా (Diego Garcia) ల‌క్ష్యంగా క్షిప‌ణుల (Iran Missiles)ను ప్ర‌యోగించింది. అయితే, ఆ రెండు క్షిప‌ణులు కూడా ల‌క్ష్యాన్ని చేరుకోలేద‌ని అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

ఇరాన్ ప్ర‌యోగించిన ఓ క్షిప‌ణి మ‌ధ్య‌లోనే విఫ‌ల‌మ‌వ‌గా.. రెండోదాన్ని త‌మ దేశం అడ్డుకున్న‌ట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ ల‌క్ష్యంగా చేసుకున్న ఈ సైనిక స్థావ‌రం ఇరాన్ భూభాగం నుంచి సుమారు 4,000 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇంత దూరంలో ఉన్న యూఎస్ బేస్‌ను టెహ్రాన్ టార్గెట్ చేయ‌డం ఈ యుద్ధం ఎక్క‌డికి దారితీస్తుందోన‌న్న భయాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఇదిలా ఉండ‌గా.. తాజా దాడిపై పెంట‌గాన్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

మ‌రోవైపు మ‌ధ్య హిందూ మ‌హాస‌ముద్రంలోని డియాగో గార్సియా ద్వీపాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేయ‌డానికి ప్ర‌య‌త్నించింద‌న్న నివేదిక‌లు నిజ‌మే అయితే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మ‌రింత విస్త‌రించిన‌ట్లే అని కేంద్ర మాజీ మంత్రి మ‌నీష్ తివారీ పేర్కొన్నారు. ఇదొక ర‌కంగా పాశ్చాత్య దేశాల‌కు బ‌లమైన సంకేత‌మే అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

Also Read..

ఇన్‌ఫ్లుయెన్స‌ర్ ఆసక్తిక‌ర‌ రీల్‌.. స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..?

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇరాన్‌పై సైనిక చర్యలను త‌గ్గించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నాం.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Advertisement

తాజావార్తలు

Advertisement