Donald Trump | ఇరాన్‌పై సైనిక చర్యలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump | ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం (Iran war) ముగింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసినట్లు చెప్పారు.
International | Published On Mar 21, 2026, 9.50 am IST
Donald Trump | ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం (Iran war) ముగింపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసినట్లు చెప్పారు. ఇరాన్‌పై తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని.. సైనిక చర్యలను క్రమంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాల గురించి ట్రంప్ వివరించారు.
"ఇరాన్ ఉగ్రవాద పాలనపై మధ్యప్రాచ్యం (Middle East)లో మేము చేపట్టిన గొప్ప సైనిక ప్రయత్నాలను ముగించే దిశగా మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేశాం. ఉగ్రవాద ముప్పుగా మారిన ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాం. వైమానిక, నౌకాదళాలను తుడిచిపెట్టేశాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుంది" అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.
మిత్రదేశాలకు రక్షణ కల్పిస్తున్నాం..
అదేవిధంగా పశ్చిమాసియాలోని తన మిత్ర దేశాలకు వాషింగ్టన్ రక్షణ కల్పించినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ సహా ఇతర మధ్యప్రాచ్య మిత్రదేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు.
హర్మూజ్‌లో నౌకల భద్రత అమెరికా బాధ్యత కాదు..
ఇదే సందర్భంగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఆ జలసంధిలో నౌకల భద్రత అమెరికా బాధ్యత కాదని తేల్చిచెప్పారు. ఈ సముద్ర మార్గంపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి స్వయంగా బాధ్యత వహించాలన్నారు. "ఆ మార్గాన్ని అమెరికా ఉపయోగించదు. కాబట్టి దాని ద్వారా లబ్ధి పొందుతున్న దేశాలే తమ భద్రతను చూసుకోవాలి" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో సాయం కోరితే అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత ఆ అవసరం ఉండదని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read..
ఇరాన్‌పై దాడులకు మా సైనిక స్థావరాలు వినియోగించుకోచ్చు.. యూఎస్‌తో చేతులు కలిపిన యూకే
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ
ఈ నాలుగు నగరాల్లో మూతపడనున్న విమానాశ్రయాలు.. కారణం ఏంటంటే?
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






