త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఇన్‌ఫ్లుయెన్స‌ర్ ఆసక్తిక‌ర‌ రీల్‌.. స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..?

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి ఓ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ (Influencer) చేసిన ఓ విజ్ఞ‌ప్తి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

D

National | Published On Mar 21, 2026, 11.23 am IST

PM Modi | ఇన్‌ఫ్లుయెన్స‌ర్ ఆసక్తిక‌ర‌ రీల్‌.. స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..?
Advertisement

PM Modi | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి ఓ సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ (Influencer) చేసిన ఓ విజ్ఞ‌ప్తి ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న తండ్రి చ‌క్కెర వాడ‌కాన్ని (Sugar Consumption) త‌గ్గించేలా సాయం చేయాలంటూ ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేసిన విన్న‌పం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ రీల్‌కు ప్ర‌ధాని కూడా స్పందించ‌డం విశేషం.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..? యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. 'షుగర్ కమ్ కర్వా దో పాపా కీ' (మా నాన్నగారి చక్కెర వాడకం తగ్గించండి) అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. త‌న తండ్రి ప్ర‌ధాని మోదీకి పెద్ద అభిమాని అని అందులో పేర్కొన్నాడు. ప్ర‌ధాని చెప్పే మాట‌ల‌ను త‌న తండ్రి తూచా త‌ప్ప‌కుండా పాటిస్తాడ‌ని పేర్కొన్నాడు. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చెబితే తన తండ్రి అధికంగా చక్కెర తినడం మానేసి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారతదేశంలోని చాలా మంది తండ్రులకు స్నేహితులు, కుటుంబ సభ్యుల కన్నా మోదీయే ఎక్కువ ఇష్టమని, వారి ప్రేమ ర్యాంకింగ్‌లో మోదీ మొదటి స్థానంలో ఉంటారని చమత్కరించాడు.

ఈ వీడియోకు ఆక‌ర్షితులైన ప్ర‌ధాని మోదీ.. త‌న‌దైన స్టైల్లో స్పందించారు. అంతేకాదు ఆ రీల్‌ను త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. "యువరాజ్ అభ్యర్థన మేరకు చక్కెర వినియోగాన్ని తగ్గించాలని నేను అతని తండ్రి, ఇతరులందరినీ కోరుతున్నాను.. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి" అని ప్ర‌ధాని సూచించారు. అంతేకాదు, ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ కీల‌క ఆరోగ్య సూచ‌న‌లు చేశారు. అధిక చ‌క్కెర వినియోగం అనేక వ్యాధుల‌కు దారితీస్తుంద‌ని హెచ్చ‌రించారు. ముఖ్యంగా ఊబ‌కాయం ముప్పు పొంచి ఉంటుంద‌న్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాల‌ని సూచించారు. శరీర దృఢత్వానికి, చురుకుదనానికి యోగా ఒక గొప్ప మార్గం అని ప్ర‌ధాని పేర్కొన్నారు.

Also Read..

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఒకప్పుడు కరువుతో అల్లాడిన సిద్దిపేటకు వ‌రంలా మారిన కాళేశ్వరం: హరీశ్ రావు

విక‌టించిన వైద్యం.. దంతాన్ని తొల‌గించే క్ర‌మంలో మ‌హిళ మృతి.. డాక్ట‌ర్ ప‌రారీ..

Advertisement

తాజావార్తలు

Advertisement