UK | ఇరాన్‌పై దాడులకు మా సైనిక స్థావరాలు వినియోగించుకోచ్చు.. యూఎస్‌తో చేతులు కలిపిన యూకే
UK | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికాతో మరో దేశం చేతులు కలుపనుంది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దిగ్ద్భందించిన ఇరాన్ క్షిపణి స్థావరాలపై తమ భూభాగంపై నుంచి దాడులు చేయవచ్చంటూ యూకే (UK) ప్రభుత్వం అమెరికాకు (United States) అనుమతి ఇచ్చింది.
International | Published On Mar 21, 2026, 7.48 am IST
UK | త్రినేత్ర.న్యూస్: ఇరాన్‌పై యుద్ధానికి అమెరికాతో మరో దేశం చేతులు కలుపనుంది. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) దిగ్ద్భందించిన ఇరాన్ క్షిపణి స్థావరాలపై తమ భూభాగంపై నుంచి దాడులు చేయవచ్చంటూ యూకే (UK) ప్రభుత్వం అమెరికాకు (United States) అనుమతి ఇచ్చింది. తమ సైనిక స్థావరాలను వినియోగించు కోవచ్చంటూ యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో (Iran) జరిగే యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాలుపంచుకోదని గతంలో ప్రకటించిన ఆయన.. మధ్యప్రాచ్యంలో (Middle East) తమ మిత్రదేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడుతుండటంతో స్టార్మర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ (RAF Fairford), హిందూ మహాసముద్రంలోని యూఎస్-యూకే సంయుక్త స్థావరమైన డీగో గార్సియాను (Diego Garcia) ఇరాన్‌పై దాడులకు అమెరికా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.

అయితే స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యూకే సాయంపై ఇప్పటికే ఆలస్యమైందని, ఈ పని చాలా ముందే చేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా, అమెరికాకు యూకే మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్మర్ నిర్ణయం బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చెప్పారు. బ్రిటిష్ ప్రజల్లో చాలా మంది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదన్నారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.
ఐరోపా దేశాల సంయుక్త ప్రకటన..
ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ యుద్ధంపై గత గురువారం (మార్చి 19న) బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. నౌకలు, ఆయిల్ ట్యాంకర్లను సురక్షితంగా హర్మూజ్ జలసంధి దాటించేందుకు చేపట్టే సముచిత చర్యలకు తోడ్పాటును అందిస్తామని ఆయా దేశాలు వెల్లడించాయి. ప్రపంచ ఇంధన మార్కెట్ల సుస్థిరత కోసం తాము చర్యలను చేపడతామని తెలిపాయి. పశ్చిమాసియా ప్రాంతంలోని దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాయి. వెంటనే దాడులను ఆపాలని ఇరాన్‌కు సూచించాయి. హర్మూజ్ జలసంధి సముద్ర మార్గంలో పరిచిన మైన్‌లను తొలగించాలని కోరాయి. నౌకలు, ఆయిల్ ట్యాంకర్లపై దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి.
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
- ●Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
- ●ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు
- ●Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
- ●E20 Janta Party | ప్రధాన్ ఔట్.. గడ్కరీ లోడింగ్.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం తప్పదా..? SMలో E20 జనతా పార్టీ సంచలనం
- ●Drugs | డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించాడు..

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన

ISRO | ఇస్రోలో అసిస్టెంట్, యూడీసీ పోస్టులు.. హైదరాబాద్‌లో 15 ఉద్యోగాలు

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..






