త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iranian oil | ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

Iranian oil | ముడిచ‌మురు ధ‌ర‌ల‌ను తగ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇరాన్ చ‌మురు (Iranian oil) అమ్మ‌కాల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా ఎత్తివేసింది.

D

International | Published On Mar 21, 2026, 10.27 am IST

Iranian oil | ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
Advertisement

Iranian oil | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం (Iran War) కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ముడిచ‌మురు ధ‌ర‌ల‌ను తగ్గించే ప్ర‌య‌త్నంలో భాగంగా అమెరికా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇరాన్ చ‌మురు (Iranian oil) అమ్మ‌కాల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా ఎత్తివేసింది. ఇప్ప‌టికే స‌ముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్లపై ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ దేశ చ‌మురు అమ్మ‌కాల‌కు 30 రోజుల మిన‌హాయింపు ఇచ్చింది.

ఈ విష‌యాన్ని అమెరికా ట్రెజ‌రీ కార్య‌ద‌ర్శి స్కాట్ బెస్సెంట్ (US Treasury Secretary Scott Bessent) ప్ర‌క‌టించారు. అయితే, ఇది తాత్కాలిక‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో (global markets) చ‌మురు స‌ర‌ఫ‌రాను పెంచేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ తాత్కాలిక చ‌ర్య ద్వారా 140 మిలియ‌న్ బ్యారెళ్ల ఇరాన్ చ‌మురు ప్ర‌పంచ మార్కెట్‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇప్ప‌టికే స‌ముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చ‌మురుకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త కొనుగోళ్ల‌కు, ఉత్ప‌త్తికి అనుమ‌తి లేద‌ని వెల్ల‌డించారు. ఇక ఈ తాత్కాలిక మిన‌హాయింపు ఏప్రిల్ 19 వ‌ర‌కూ మాత్ర‌మే అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జ‌రుపుతున్న దాడుల కార‌ణంగా ప‌శ్చిమాసియా ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. ఈ యుద్ధం కార‌ణంగా ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు జీవ‌నాడి అయిన హర్మూజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసివేసింది. ఫ‌లితంగా చ‌మురు నౌక‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ప‌రిస్థితిపై ప్ర‌పంచ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read..

ఇరాన్‌పై సైనిక చర్యలను త‌గ్గించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నాం.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఇరాన్‌పై దాడుల‌కు మా సైనిక స్థావ‌రాలు వినియోగించుకోచ్చు.. యూఎస్‌తో చేతులు క‌లిపిన యూకే

ఈ నాలుగు న‌గ‌రాల్లో మూత‌ప‌డ‌నున్న విమానాశ్ర‌యాలు.. కారణం ఏంటంటే?

Advertisement

తాజావార్తలు

Advertisement