త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | హర్మూజ్​ను 48 గంటల్లోగా తెరవాల్సిందే.. లేదంటే మీ విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం.. ఇరాన్​కు ట్రంప్ వార్నింగ్

Donald Trump | ఇరాన్ (Iran), ఇజ్రాయెల్‌-అమెరికా (America) యుద్ధం నాలుగో వారంలోకి ప్ర‌వేశించింది. ఇన్ని రోజులు ప‌శ్చిమాసియాకే (Middle East) ప‌రిమిత‌మైన యుద్ధం మ‌రింత విస్త‌రిస్తున్న‌ది.

G

International | Published On Mar 22, 2026, 7.35 am IST

Donald Trump | హర్మూజ్​ను 48 గంటల్లోగా తెరవాల్సిందే.. లేదంటే మీ విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తాం.. ఇరాన్​కు ట్రంప్ వార్నింగ్
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్ (Iran), ఇజ్రాయెల్‌-అమెరికా (America) యుద్ధం నాలుగో వారంలోకి ప్ర‌వేశించింది. ఇన్ని రోజులు ప‌శ్చిమాసియాకే (Middle East) ప‌రిమిత‌మైన యుద్ధం మ‌రింత విస్త‌రిస్తున్న‌ది. హిందూ మ‌హాస‌ముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా సైనిక స్థావ‌రంపై ఇరాన్ శ‌నివారం దాడి చేసింది. దీంతో ఇరుప‌క్షాలు రోజంతా కాల్పులు జ‌రుపుకున్నాయి. మ‌రోవైపు ముడి చ‌మురు ర‌వాణాకు ప్ర‌ధాన మార్గ‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసివేయ‌డంతో ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో దానిని తెరిపించేందుకు అమెరికా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ఈక్ర‌మంలో హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని, లేకపోతే ఇరాన్‌పై దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు.

హ‌ర్మూజ్‌ను గడువులోపు తెర‌వ‌క‌పోతే ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్‌లను (Power Plants) పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా జలసంధిని తెరవాలని వివరించారు. హర్మూజ్‌ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్‌లోని పెద్ద విద్యుత్‌ కేంద్రంతోనే దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈమేర‌కు త‌న సోష‌ల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు.

ఇవికూడా చ‌ద‌వండి..

యుద్ధం మ‌రింత తీవ్రం.. హిందూ మ‌హాస‌ముద్రంలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

చమురు కాదు.. నీరే గ‌ల్ఫ్‌కు లైఫ్‌లైన్‌!

Advertisement

తాజావార్తలు

Advertisement