NEET retest paper leak | నీట్ రీఎగ్జామ్ పేపర్ లీక్..? ఎన్‌టీఏ ఏమన్నదంటే..?
NEET retest paper leak | నిన్న జరిగిన నీట్ రీఎగ్జామ్ పేపర్ లీకైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌తో (PIB Fact Check) చెక్ పెట్టింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు నిరాధారమైనవని, అసత్యమైనవని స్పష్టం చేసింది.
NEET retest paper leak | దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే, ఎగ్జామ్ పూర్తైన తర్వాత టెలిగ్రామ్‌లో పరీక్ష పేపర్ లీకైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పేపర్ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించాయి. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ఫేక్ అని తెలిపాయి.
నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలు నిరాధారమైనవని, అసత్యమైనవని ప్రభుత్వ అధికారిక నిజ నిర్ధరణ విభాగమైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. పేపర్ లీకైందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. "పరీక్షకు ముందే టెలిగ్రామ్‌లో నీట్ 2026 పునఃపరీక్ష క్వశ్చన్ పేపర్ లీకైందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది పూర్తిగా అవాస్తవం. పేపర్ లీకైందంటూ వస్తున్న వార్తలకు ఎలాంటి ఆధారాలూ లేవు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేసింది.
మే 3న జరిగిన పరీక్షలో 'పేపర్ లీక్' ఆరోపణలు రావడంతో, పాత పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న ఆదివారం మళ్లీ పరీక్ష నిర్వహించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ రీ-ఎగ్జామ్ నిర్వహించింది. దేశవిదేశాల్లోని 5,440 సెంటర్లలో దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
Also Read..
అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
సంబంధిత వార్తలు

Bank Holidays | బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు లేదు
అక్టోబర్ 1, 2026

NTA Examination Calendar | జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్-1.. వివిధ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఎన్‌టీఏ
సెప్టెంబర్ 17, 2026

UGC NET | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
ఆగస్టు 29, 2026
తాజావార్తలు
- ●KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం
- ●Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
- ●Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?
- ●Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్
- ●Vikarabad | వికారాబాద్‌లో మహిళ అదృశ్యం.. నారాయణపేటలో సగం కాలిన స్థితిలో మృతదేహం..
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..

KTR | కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం.. కాలిఫోర్నియా ఆరోగ్య సదస్సుకు ఆహ్వానం

Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి

Free Bus | సీనియర్ సిటిజన్స్‌కు ఫ్రీ బస్?

Raashi Khanna | సమంత భర్త బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి రాశీఖన్నా ఔట్ - టాలీవుడ్ బ్యూటీకి ఛాన్స్



