Ras Laffan | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
Ras Laffan | ఖతార్ (Qatar)కు చెందిన కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) గ్యాస్ ఎగుమతి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 54 మంది గాయపడగా.. 18 మంది గల్లంతయ్యారు.
International | Published On Jun 22, 2026, 11.03 am IST
Ras Laffan | ఖతార్ (Qatar)కు చెందిన కీలకమైన రాస్ లఫాన్ (Ras Laffan) గ్యాస్ ఎగుమతి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 54 మంది గాయపడగా.. 18 మంది గల్లంతయ్యారు. ఇటీవలే ఇరాన్ జరిపిన దాడుల్లో ఈ గ్యాస్ క్షేత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే, దాదాపు రెండు నెలలు శ్రమించి దీన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికాతో యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలతో ఖతార్ రవాణాను సాగించలేక ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేలా చర్చలు జరుగుతుండటంతో ఇరాన్ తన ఎగుమతులపై దృష్టిపెట్టింది. ఇందుకోసం పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బర్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్‌లో పనులు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ సంస్థ తెలిపింది. పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఈ పేలుడు కారణంగా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
వాహనాలు తనిఖీ చేస్తుండగా డీటీవోపైకి దూసుకెళ్లిన లారీ..
పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
ఐపీవోల సందడి మళ్లీ షురూ.. ఈ వారం 3 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు..
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
ఆగస్టు 22, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

Stock Markets | చమురు ధరల ఆందోళనతో కుదేలైన మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ నష్టాల్లో..
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



