NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
NEET PG | నీట్ పీజీ వైద్య ప్రవేశాల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్ ఆధారిత అర్హత విధానాన్ని తొలగించి.. ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
- పర్సంటైల్ విధానానికి స్వస్తి..
- ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు
- సుప్రీంకోర్టుకు 12 మంది నిపుణుల కమిటీ నివేదిక
- ఖాళీ సీట్ల భర్తీకి ఫీజుల తగ్గింపు
NEET PG | నీట్ పీజీ వైద్య ప్రవేశాల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్ ఆధారిత అర్హత విధానాన్ని తొలగించి.. ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని 12 మంది సభ్యుల నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. నీట్ పీజీతో పాటు సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష (NEET SS)కు ఈ విధానాన్ని అమలు చేయాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వెల్లడించింది. త్వరలో ముసాయిదా నిబంధనలు విడుదల చేసి, భాగస్వాముల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
కటాఫ్ తగ్గింపుతో మొదలైన వివాదం
నీట్ పీజీ-2025లో ఖాళీ సీట్ల భర్తీ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అర్హత మార్కులను భారీగా తగ్గించడంతో వివాదం మొదలైంది. జనరల్ కేటగిరీ కటాఫ్ 276 నుంచి 103కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కటాఫ్ 235 నుంచి మైనస్ 40కి తగ్గించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం.. వైద్య విద్య ప్రమాణాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రవేశాల విధానాన్ని సమగ్రంగా సమీక్షించి లోపాలను గుర్తించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
ఖాళీ సీట్ల భర్తీకి సూచనలు
- వైద్య విద్య ప్రమాణాలను కాపాడుతూనే ఖాళీ సీట్ల సమస్యను పరిష్కరించాలని కమిటీ సూచించింది. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు చేసింది.
- క్లినికల్, నాన్ క్లినికల్ కోర్సులకు వేర్వేరు ఫీజులు నిర్ణయించి.. నాన్ క్లినికల్ కోర్సుల ఫీజులు తగ్గించాలి.
- ప్రీ క్లినికల్, పారాక్లినికల్ కోర్సుల్లో సర్వీస్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి.
- ఖాళీ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్ రౌండ్లు నిర్వహించాలి.
- సీట్లు బ్లాక్ చేసే అభ్యర్థులను అడ్డుకునేందుకు నీట్ పరీక్షల్లో బయోమెట్రిక్, గుర్తింపు ధ్రువీకరణ అమలు చేయాలి.
- డెంటల్, నర్సింగ్ కోర్సుల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. వరుసగా రెండుమూడేళ్లు ఖాళీగా ఉంటున్న సీట్లను మూసివేయడం, ఫీజులు తగ్గించడం పరిశీలించాలి.
కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్ విధానం
2026-27 విద్యా సంవత్సరానికి కౌన్సెలింగ్ ఆలస్యాన్ని తగ్గించేందుకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఫ్రీజ్’, ‘ఫ్లోట్’ విధానాలను ప్రవేశపెట్టింది. ఫ్రీజ్ ద్వారా కేటాయించిన సీటును ఖరారు చేసుకోవచ్చు. ఫ్లోట్ ఎంచుకున్నవారు ప్రస్తుతం వచ్చిన సీటును అంగీకరిస్తూనే మెరుగైన సీటు కోసం ప్రయత్నించవచ్చు. సీటు అప్‌గ్రేడ్ కోసం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఫీజు ఒక్కసారే చెల్లించేలా, సర్టిఫికెట్ల అప్‌లోడ్, వెరిఫికేషన్ కూడా ఆన్‌లైన్‌లో జరిగేలా మార్పులు చేశారు. ఎన్‌ఎంసీని ఎంసీసీ కౌన్సెలింగ్ పోర్టల్‌కు అనుసంధానించడంతో మెడికల్ కాలేజీల సీట్ల వివరాలను నేరుగా ధ్రువీకరించే అవకాశం ఏర్పడింది. గతంలో రెండు సంస్థల మధ్య వివరాలను మాన్యువల్‌గా సరిపోల్చాల్సి వచ్చేది. కొత్త విధానంతో సీట్ల వివరాల్లో డూప్లికేషన్ సమస్య తగ్గడంతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ క్రమబద్ధమైంది.
భవిష్యత్ కౌన్సెలింగ్‌కు ఐదు సూచనలు
- కౌన్సెలింగ్‌కు ముందే ఎన్‌ఎంసీ, ఎన్‌బీఈఎంఎస్, ఎన్‌టీఏ ధ్రువీకరించిన సీట్ల వివరాలు అందించాలి.
- ప్రతి విద్యా సంవత్సరం, కోర్సుకు ముందుగానే కౌన్సెలింగ్ షెడ్యూల్ రూపొందించి సుప్రీంకోర్టు ఆమోదం పొందాలి.
- కౌన్సెలింగ్‌కు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీలు) రూపొందించి ఏటా నవీకరించాలి.
- కౌన్సెలింగ్‌కు ముందు, తర్వాత సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించాలి.
- నీట్ ఫలితాలను రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలకు నేరుగా పంపే ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
కమిటీ ప్రతిపాదనపై అభ్యంతరం
నిపుణుల కమిటీ నివేదికపై పిటిషనర్ల తరఫు న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కటాఫ్ మార్కుల భారీ తగ్గింపును సమర్థించాల్సింది పోయి.. ఇప్పుడు పర్సంటైల్ విధానం నుంచి ర్యాంక్ విధానానికి మారాలని ప్రతిపాదించడం ఏమిటని ప్రశ్నించారు. నివేదికపై స్పందన తెలియజేసేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
- ●Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
- ●Ramayana Piracy | రిలీజ్‌కు ముందే జాగ్రత్త - "రామాయణ" పైరసీపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- ●Nitin Gadkari EV Charging Tariff | రూ.600 ఖర్చుతో 1,000 కి.మీ జర్నీ.. ఈవీ ఛార్జింగ్‌పై నితిన్ గడ్కరీ సంచలన ప్రతిపాదన

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన

Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం

Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు





