Khawaja Asif | అదే జరిగితే భారత్‌తో యుద్ధమే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకునే చర్యలు తమ దేశ నీటి భద్రతకు (Pakistan water security) ముప్పు కలిగిస్తాయని భావిస్తే ఇస్లామాబాద్ సైనిక చర్యకు దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు.
International | Published On Jun 22, 2026, 11.29 am IST
Khawaja Asif | దాయాది పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు దిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల వ్యవహారంలో ( Indus Waters Treaty) ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకునే చర్యలు తమ దేశ నీటి భద్రతకు (Pakistan water security) ముప్పు కలిగిస్తాయని భావిస్తే ఇస్లామాబాద్ సైనిక చర్యకు దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు.
ఓ మీడియాతో ఆసిఫ్ మాట్లాడుతూ.. నీరు అనేది తమకు అత్యంత కీలకమైన జాతీయ భద్రతా అంశమని తెలిపారు. భారత్ చర్యలతో సింధు నదీ పరివాహక ప్రాంత జలాల లభ్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. "నీరు కూడా మా జాతీయ భద్రతలో భాగమే. ముప్పు పొంచి ఉందని భావించిన మరుక్షణమే.. మేము భారతదేశంపై యుద్ధానికి వెళ్తాము. ఇది ఖాయం" అని ఆయన అన్నారు. కాగా, 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్థాన్‌కు పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్ పటిల్ (CR Patil) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత అసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్థాన్ ప్రోత్సహిత సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ స్పష్టం చేసింది. భారత్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Also Read..
ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు
ఆగస్టు 20, 2026

Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ
ఆగస్టు 7, 2026

CM Revanth Reddy | తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇప్పించండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ



