TVK | నీట్‌ను రద్దు చేయడమే.. సమస్యకు ఏకైక పరిష్కారం : టీవీకే
TVK | నీట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ఆందోళనలకు తమిళనాడులోని అధికార టీవీకే (TVK) పార్టీ మద్దతు ప్రకటించింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కారమని స్పష్టం చేసింది.
TVK | నీట్ అంశంపై ఢిల్లీలో కాక్రోచ్ పార్టీకి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు ఉధృతం చేశాయి. కాంగ్రెస్ సహా టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ తదితర పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మద్దతు తెలిపింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కారమని స్పష్టం చేసింది. నీట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా టీవీకే గుర్తు చేసింది. వైద్యవిద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడం ఈ సమస్యకున్న శాశ్వత పరిష్కారమని వెల్లడించింది. ఇందుకు న్యాయపరంగా ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించే వరకు తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.
అదేవిధంగా నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిరసనగా సోమవారం ఢిల్లీలో నిరసన చేస్తున్న సీజేపీ విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని టీవీకే తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపింది. ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా టీవీకే ప్రకటించింది.
Also Read..
మీరు దేశానికి చాలా అవసరం.. దీక్ష విరమించండి.. వాంగ్‌చుక్‌కు దిప్కే విజ్ఞప్తి
చర్చల కోసం మంత్రులే మా దగ్గరకు రావాలి.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం
దాశరథి లాంటి వారే కేసీఆర్‌కు స్ఫూర్తి : మాజీ మంత్రి తలసాని
తాజావార్తలు
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు





