Talasani Srinivas Yadav | దాశరథి లాంటి వారే కేసీఆర్‌కు స్ఫూర్తి : మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు లాంటి వారే కేసీఆర్‌కు స్ఫూర్తి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో దాశరథి కృష్ణమాచార్యులు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు లాంటి వారే కేసీఆర్‌కు స్ఫూర్తి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో దాశరథి కృష్ణమాచార్యులు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి చిత్రపటానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాలోతు కవిత, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం నింపిన కవి దాశరథి. దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దాశరథి ఆలోచన విధానాన్ని కేసీఆర్ ఎల్లప్పుడు ముందుకు తీసుకెళ్లారు. ఆనాడు తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు, కరెంట్ లేక రైతాంగం ఇబ్బంది పడుతున్న తీరు దాశరథి పుస్తకాలు చదివితే తెలుస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలు గోస పడ్డారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు రావాలని దాశరథి తన కలంతో కవితలు రాశారు. మన రాష్ట్రం మనకే ఉండాలని దాశరథి పోరాట పటిమతో ముందుకు వెళ్లారు. దాశరథి స్పూర్తితో ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారు. తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంట్‌తో పాటుగా మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీసి, భగీరథతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం.. ఈరోజు రైతాంగం సస్యశ్యామలంగా ఉన్నారంటే దానికి దాశరథి వంటి వారే కేసీఆర్‌కు స్ఫూర్తి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
దాశరథి ఆశయాలకు అనుగుణంగా..
అనంతరం మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. మా సొంత మండలం చిన్న గూడూరు.. దాశరథి మా మండలంలో పుట్టడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దాశరథి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించి రైతాంగాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేశారు.
నిజాం రాజును తరతరాల బూజు అని గట్టిగా నిలదీసిన కవి దాశరథి
ఆ తర్వాత దేవీప్రసాద్ మాట్లాడుతూ.. తన రచనల ద్వారా స్వేచ్ఛ, సమానత్వాన్ని తెలంగాణ సమాజానికి దక్కాలని దాశరథి కృషి చేశారు. నిజాం రాజుల దగ్గర విరోచితమైన పోరాటం చేసిన గొప్ప కవి దాశరథి. భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దాశరథి వెన్నుదన్నుగా ఉన్నారు. ప్రజా పోరాటాల పట్ల పాలకులు అనుచరిస్తున్న దుర్నీతిని ఎండగట్టిన ప్రజా కవి దాశరథి. అనేక సందర్భాల్లో దాశరథి జైలు జీవితం గడిపినప్పుడు జైలు గోడలపై రాసిన అనేక కవితలు తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి. కేసీఆర్ 10 ఏండ్ల పాలనలో అనేక మంది తెలంగాణ వైతాళికులకు సంబంధించిన చరిత్రను పుస్తకాల్లో ఉండాలని కేసీఆర్ కృషి చేశారు. దాశరథి, కాళోజీ, గద్దర్ అనేక మంది కవులు తెలంగాణ ప్రజల కన్నీళ్లు కష్టాలను కథలల్లో వినిపించారు. ప్రజాస్వామ్యబద్దంగా తెలంగాణ సాధించుకోవడం కోసం కొండంత అండ దాశరథి రచనలు. నిజాం రాజును తరతరాల బూజు అని గట్టిగా నిలదీసిన కవి దాశరథి. దాశరథి స్పూర్తితో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పరిపాలనలో 24 గంటల కరెంట్, నీళ్ళు ఇచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్లు కరెంట్ ఇవ్వలేక పోతుంది. దాశరథి స్పూర్తితో ఈ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే సమయం ఆసన్నమైందని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల





