త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk | మీరు దేశానికి చాలా అవ‌స‌రం.. దీక్ష విర‌మించండి.. వాంగ్‌చుక్‌కు దిప్కే విజ్ఞ‌ప్తి

Sonam Wangchuk | నీట్ పేప‌ర్ లీక్‌, దేశ విద్యావ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ గ‌త నెల‌రోజులుగా త‌న ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వానికి సీజేపీ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. నిర‌స‌న‌కారులు చ‌ర్చ‌ల‌కు వ‌స్తే మాట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ ప్ర‌భుత్వం చెబుతుండ‌గా.. చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌నుకుంటే మంత్రులే త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్ప‌ష్టం చేశారు. తాము మాత్రం జేపీ న‌డ్డా నివాసానికి వెళ్ల‌బోమ‌ని తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు.

D

National | Published On Jul 22, 2026, 4.24 pm IST

Sonam Wangchuk | మీరు దేశానికి చాలా అవ‌స‌రం.. దీక్ష విర‌మించండి.. వాంగ్‌చుక్‌కు దిప్కే విజ్ఞ‌ప్తి
Advertisement

Sonam Wangchuk | త్రినేత్ర‌.న్యూస్ : త‌మ డిమాండ్లు నెర‌వేరే వ‌ర‌కూ ఉద్య‌మం ఆప‌బోమ‌ని కాక్రోచ్ జ‌న‌తాపార్టీ స్ప‌ష్టం చేసింది. జులై 20న చేప‌ట్టిన నిర‌స‌న‌లు కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని పేర్కొంది. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను అంగీక‌రించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. త‌మ నిర‌స‌న‌ల‌ను మ‌రింత తీవ్ర‌స్థాయిలో చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది. ల‌క్ష‌లాది మంది విద్యార్థులతో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌న్నదే తమ ప్ర‌ధాన డిమాండ్ అని తెలిపింది.

వాంగ్‌చుక్ దేశానికి చాలా అవ‌స‌రం

సీజేపీకి మ‌ద్ద‌తుగా నిర‌వ‌ధిక నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్న‌ ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్‌చుక్ మ‌న దేశానికి ఎంతో అవ‌స‌ర‌మ‌ని సీజేపీ అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు దీక్ష‌ను విర‌మించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. డిమాండ్లు నెరవేరే వరకు తాము జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతామ‌ని అభిజీత్ దిప్కే స్ప‌ష్టం చేశారు. అదేస‌మ‌యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విర‌మించాల‌ని కోరుతూ 50 మంది ప్ర‌తిప‌క్ష ఎంపీలు విజ్ఞ‌ప్తి చేశారు. వారంతా మేదాంత ఆసుప‌త్రికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మెట్రో స్టేష‌న్లు క్లోజ్‌

కాక్రోచ్ పార్టీ నిర‌స‌న‌ల‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీ హై అల‌ర్ట్‌లోకి వెళ్లిపోయింది. భ‌ద్ర‌తా కార‌ణాల‌ దృష్ట్యా లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌, రాజీవ్ చౌక్‌, సెంట్రల్ సెక్రటేరియట్, ITO స‌హా 16 మెట్రో స్టేష‌న్ల‌ను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తాత్కాలికంగా మూసివేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సదుపాయం క‌ల్పించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కూ ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని డీఎమ్ఆర్‌సీ వెల్ల‌డించింది.

విద్యార్థుల ఆందోళ‌న‌లు.. సంస్క‌ర‌ణ‌ల‌కు దారి తీస్తుంది

విద్యార్థుల నిర‌స‌న‌ల‌పై నీట్ యూజీ ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక‌ర్ ఆర్య‌న్ గుప్తా స్పందించారు. నీట్ ప‌రీక్ష‌లో చోటు చేసుకున్న ప‌రిస్థితులు అన్యాయ‌మైన‌వేన‌ని చెప్పారు. విద్యార్థులు లేవ‌నెత్తిన ఆందోళ‌న‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు దారితీస్తాయ‌ని అభిప్రాయప‌డ్డారు. భ‌విష్య‌త్తులో ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీలు, అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా అడ్డుకునేందుకు సాయ‌ప‌డ‌తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అదే స‌మయంలో విద్యార్థులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండాల‌ని సూచించారు.

Also Read..

వ‌ర్షాల కోసం 108 క‌ల‌శ‌ల‌తో అభిషేకం.. మంత్రి పొన్నం వ‌రుణ‌యాగం

స్టాక్ మార్కెట్‌ల‌కు భారీ షాక్.. 700 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్..

అమిత్ షా, ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాలి : మంత్రి పొంగులేటి

Advertisement
Advertisement